పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వస్తువుల ఖరీదులు మన దేశంలో కంటే ఎక్కువ. హోటల్ సమీపాన మార్కెట్టు ఉంది. ఆ మార్కెట్టును చూస్తే మన దేశంలో ఉండే సంతలు స్పురిస్తాయి. కాయకూరలు, పండ్లు, మాంసం, చేపలు అక్కడ విక్రయిస్తారు. మన దేశంలో లభ్యమయ్యే కూరగాయలన్నీ అక్కడ దొరుకుతాయి.

మన భారతదేశంలో డిశంబరు నెలలో శీతాకాలం అవుతుంది. అయితే మారిషన్ లో ఆ నెలలో వేసవి అవుతుంది. మనకు ఏప్రియల్లో, మేలో దొరికే మామిడిపళ్ళు అక్కడ డిశంబర్ నాటికే దర్శనమిచ్చాయి. మన ప్రతినిధులు వాటిని చూస్తూనే డాలర్లని మార్చుకుని వాటిని కొని రసాస్వాదన చేశారు.

ఆ రోజు మధ్యాహ్నం గోల్డ్ క్రిస్ట్ హోటల్లో భారతీయ ప్రతినిధుల గౌరవార్ధం మారిషస్ ఆంధ్ర మహాసభ విందు భోజనం ఏర్పాటు చేసింది. మారిషస్ ప్రభుత్వ మంత్రులు శ్రీ ఆర్ముగం పరుశురామన్, శ్రీ ఉచ్చన్న ప్రభృతులతో బాటు మారిషస్ ఆంధ్ర ప్రముఖులు అనేకులు ఆ విందులో పాల్గొన్నారు.

ఆంధ్ర మహాసభ ఆధ్యక్షులు శ్రీ సూరయ్య మహాసభల ఏర్పాట్ల గురించి, జరగబోయే కార్యక్రమాల గురించి వివరించి భారత ప్రతినిధులకు హృదయపూర్వక స్వాగతం పలికారు.

మేము మారిషన్ లో అడుగు పెట్టిన డిశంబరు 7వ తేదీ నుండి డిశెంబర్ 13వ తేదీ తిరుగు ప్రయాణం వరకు తీరిక చిక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గం॥లకు హోటల్ నుండి బయలుదేరితే రాత్రి 11 గం॥ల లోపు ఎప్పుడూ హోటల్ కు తిరిగి చేరుకోలేదు. నిముష నిముష కార్యక్రమం వివరాలు పుస్తక రూపంగా ప్రచురించి ఆహ్వాన సంఘం వారు మాకు అందచేశారు.

మారిషన్ ఆంధ్ర ప్రముఖుడు, విద్యావేత్త స్వర్గీయ నారాయణస్వామి అచ్చుమన్న రాయ్డు గౌరవార్ధం వాకోస్ లోని ప్రభుత్వ పాఠశాలకు ఆరోజు ఆయన పేరు పెట్ట బడింది. తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్ర ప్రముఖునికి లభించిన అపూర్వ గౌరవం అది.

కనులకు విందైన తెలుగు చలన చిత్రోత్సవం

అదేరోజు సాయంత్రం 4 గం॥లకు వాకోస్ లోని ట్రాఫల్లర్ హాలులో తెలుగు చలన చిత్రోత్సవాన్ని ప్రముఖ సినీ నటుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు.

నటుడిగా ఉన్నత శిఖరాలను ఆదిరోహించిన వ్యక్తి-వ్యక్తిగా అత్యున్నత