పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దర్శనార్ధం ఎందరో విదేశీ యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ప్రశాంత ప్రకృతితో ఓలలాడే మారిషస్ చక్కటి విశ్రాంతి కేంద్రంగా బావుంటుందని నాకు అనిపించింది.

1972 జనాభా లెక్కల ప్రకారం మారిషస్ దేశ జనాభా 825,699. అందులో హిందువులు 428,167, ముస్లిములు 137,081, సినోమారిషయన్లు 24,084, ఇతరులు 236,367 మంది ఉన్నారు.

వివిధ మాతృభాషలు మాట్లాడేవారు ఈ క్రింది విధంగా ఉన్నారు. (1972 జనాభా లెక్కల ననుసరించి)

చైనీస్ - 20,608 సింధీ - 320,831
క్రియోల్ - 272,075 మరాఠీ - 16,553
ఇంగ్లీషు - 2,402 తమిళ్ - 56,751
ఫ్రెంచి - 36,729 తెలుగు - 24,233
గుజరాతి - 2,028 ఉర్దూ - 71,668

ఇంగ్లీషు, ఫ్రెంచి-మారిషస్ ప్రభుత్వ అధికార భాషలు. అక్కడ ప్రజలు మాట్లాడే భాష క్రియోలి. ఇది ఫ్రెంచి యొక్క అపభ్రంశం. దీనికి లిపి లేదు. మారిషస్ చూస్తుంటే ఒక కోణం నుంచి భారత దేశానికి ప్రతిబింబంలా అనిపిస్తే, మరోకోణం నుంచి ప్రపంచానికే ప్రతిబింబంలా అనిపిస్తుంది. అన్నిభాషల - అన్ని సంస్కృతుల అపూర్వ సమ్మేళనం ఆ చిన్న ద్వీపం.

మరువలేని ఆతిధ్యం

క్వార్టర్ బార్న్ నగరంలో ఉన్న గోల్డ్ క్రిస్ట్ (Gold Creast Hotel) హోటల్ లో విదేశీ ప్రముఖులకు విడిది ఏర్పాటు చేశారు. మారిషస్ రాజధాని నగరమైన పోర్టులూయిస్ కి 8 మైళ్ళ దూరంలో మా హోటల్ ఉంది. అధునాతనమైన ఈ హోటల్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. బార్లు, రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్ రూములు ఉన్నాయి. హోటల్ మొత్తం ఎయిర్ కండీషన్ చేయబడి ఉంది. గోల్డ్ క్రిస్ట్ హోటల్లో 308 నెంబరు రూము మాకు కేటాయించారు. విశాలంగా ఉన్న ఆ రూములో టెలివిజనూ, రేడియో, టెలిఫోన్ ఉన్నాయి. చాలా సౌకర్యంగా అనిపించిందా రూము భారత ప్రతినిధులతో బాటు దక్షిణాఫ్రికాకు చెందిన ప్రతినిధులు కూడా అదే హోటల్లో బస చేస్తున్నారు.

గోల్డ్ క్రిస్ట్ హోటల్ క్రింద భాగాన పెద్ద వాణిజ్య సముదాయం ఉంది. అన్నిరకాల, అన్నిదేశాల అధునాతన వస్తువులు అక్కడ లభ్యమవుతాయి. ఆ