పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 ప్రాచీన లావాలు మారిషస్ దీవిలోని నిమ్నోన్నతమైన పర్వత పంక్తులను ఏర్పరిచినట్టు భావిస్తున్నారు. నవీన లావా మధ్య సమతల భూములను సృష్టించింది.

మెగ్నీషియమ్, ఇనుము పాళ్ళు అధికంగా ఉన్న మారిషస్ శిలలు మాగ్నా నుంచి ఉద్భవించాయని చెబుతారు. అందువలన కపిల వర్ణంలో ఎండిన ద్రాక్షలవలె వంకరటింకర ఆకృతిలో పెద్ద పెద్ద బండలు ద్వీప మంతటా కనిపిస్తాయి.

మారిషస్‌లోని పర్వతాల పేర్లు కూడా సమ్మోహన కరంగా ఉంటాయి. శిఖరాగ్ర ఆకృతుల ననుసరించి వాటికి పేర్లు పెట్టారు. రిక్డా (బొటనవ్రేలు) ఒక శిఖరం పేరు. థమ్స్అప్ చిహ్నంలా ఉండటం చేత ఆ పేరు పొందింది. మరో శిఖరం తలక్రిందులుగా పెట్టిన ఆవు పొదుగు ఆకృతిలో ఉన్నందు వలన "మౌంట్‌ట్రా ట్స్ మామెల్స్" అనే పేరు వచ్చింది

మారిషస్ పర్వత శిఖరాలు ఉన్నతమైనవి కాకపోయినా, శిఖరాలు ఒకే ఒక రోజులోనే అధిరోహించ గలిగినా మారిషస్ ప్రజలకు ఆ శిఖరాలు స్పూర్తి ప్రదాతలుగా నిలిచాయి.

పిటాన్ డిలా పిఫైటా రివిరినోయర్ (2,711 అడుగులు) పిటెడ్ బోట్ (2,699 అడుగులు) లిపాస్ (2,661 అడుగులు) ఇవీ మారిషస్ లోని ఉన్నత శిఖరాలు.

పగడాలదీవి

మారిషస్ మన దేశానికి నైరుతి దిశగా దాదాపు మూడువేల మైళ్ళ అవతల హిందూ మహా సముద్రంలో ఉన్న అందమైన దీవి. 720 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఈ ద్వీపాన్ని 16వ శతాబ్దంలో పోర్చుగీసువారు మొదటిసారిగా ఈ ద్వీపాన్ని తమ ఆవాసంగా చేసుకున్నారు.

1721 లో ఫ్రెంచివారి ఆక్రమణలో 90 ఏళ్ళ పాటు "ఫ్రెంచిదీవి"(విల్ దే ప్రాంస్) గా ప్రసిద్ధి పొందింది. 1880లో మారిషస్ బ్రిటీష్ వారి ఆధిపత్యం క్రిందకు వచ్చి దాదాపు 150 సంవత్సరాలు వారి పాలనలో ఉండి చివరకు 1968 మార్చి 12న స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

మారిషస్ దేశ ఆర్ధిక వ్యవస్థ అంతా ఒకే ఒక పంట అనగా చెరుకు పై ఆధారపడి ఉంది. రహదారి అంచు వరకూ చెరుకు తోటలే ఉంటాయి. స్క్రిప్లింగ్ పద్ధతి ద్వారా నీరు చెరకు తోటల్లో విరజిమ్ముతూ చూడచక్కగా ఉంటుంది.

మారిషస్‌లో టూరిజమ్ చాలా అభివృద్ది చెందింది. ఈ సుందర దీవి