పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థాపించి కళకు ఎల్లలు లేవని నిరూపించిన వ్యక్తి శ్రీ ఎల్లా.

శివతాండవం, నవమృదంగం ఆయన సృష్టించిన ప్రత్యేకమృదంగవివ్యాసాలు. అంతర్జాతీయ అవార్డులు, రాష్ట్రపతి స్వర్ణపతకాన్ని సాధించి ఉన్నత కళాపీఠాన్ని అధిరోహించిన కళాకారుడాయన. దేశ విదేశాల్లో అయిదువందలకు పైగా శిష్యులకు గురుకుల పద్దతిలో ఉచితంగా మృదంగ విద్య నేర్పిన కళాతపస్వి శ్రీ ఎల్లా.

ఎక్కడ హాస్యపు జల్లులు చిందుతూ నవ్వులు విరుస్తుంటాయో అక్కడ ధ్వన్యనుకరణ సమ్రాట్ శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ వున్నట్లే. ధ్వన్యనుకరణకు ప్రపంచవ్యాప్తంగా ఒక విశిష్టస్థానం సంపాదించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపునకాని, సాంస్కృతిక సంస్థల తరపున కాని ఆయన అంతులేని ప్రదర్శనలు ఇచ్చారు.

మా నాన్నగారు మంత్రిగా వున్నప్పడు శ్రీ వేణుమాధవ్ శాసనమండలి సభ్యులుగా వున్నారు.

"అన్యుల మనము తానొప్పింపక.. తానొవ్వక" అనే మాటలకు ఆక్షరాల శ్రీ వేణుమాధవ్ ఒక ఉదాహరణ.

ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆర్ధిక సహాయంకై తెలుగు సినీ కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన సందర్భంలో నాన్నగారితో ఆయనకలసి సంచరించారు. ఆ తర్వాత శ్రీ వేణుమాధవ్ నాన్నగారితో మలేషియాలో విస్తృతంగా పర్యటించి ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు అక్కడ వారిని ఉత్తేజపరిచారు. 1977లో ఉప్పెన సందర్భంగా దివిసీమకు డా॥ నారాయణరెడ్డితో కలసి శ్రీ వేణుమాధవ్ వచ్చినప్పడు వారిని జీపులో తీసుకుని వెళ్ళి ఉప్పెనకు ఊడ్చుకుపోయిన గ్రామాల వెంట తిప్పాను. చింతకొల్లనే గ్రామం మేము చేరేసరికి యింకా అక్కడ చెట్టకు శవాలు వ్రేలాడుతూ కనిపించాయి. ఆ దృశ్యం చూడలేక కన్నీరు కార్చారు శ్రీ వేణుమాధవ్ ఆయన చాలా సున్నిత మనస్కులు.

నా ఆత్మబంధువు రంగస్థల మార్తాండుడు శ్రీ ఆచంట వెంకటరత్నం నాయ్డుసాంస్కృతిక బృందంతో మారిషస్‌కువస్తున్నందుకు నేనెంతో ఆనందించాను. "వొగిని కృష్ణ బొడ్డు జాతి మాది." నాటక రంగంలో రారాజుగా వెలుగుతున్నప్పటికీ అతి నిరాబడంబరంగా వుంటారు. ఆయన నడకలో రాజఠీవి, నటనలో భేషజం మౌలికించినా వ్యక్తిగా మాత్రం అందరికీ ప్రీతిపాత్రుడు. ఆయన స్నేహాన్ని డబ్బుతో ముడిపెట్టి చూడటం నా అనుభవంలో లేదు. ఎవరైనా స్నేహితులు నాటక ప్రదర్శన