పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

 మారిషస్, మలేషియా, శ్రీలంక, ఫిజీ, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ పశ్చిమ జర్మనీ, సింగపూరు, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, అమెరికా, బ్రిటన్, కెనడా, రష్యామొదలైన దేశాలలోని తెలుగు ప్రతినిధులు విశ్వాంధ్ర హృదయబంధంగా యీ ప్రపంచ తెలుగు మహాసభలలో అమితోత్సాహంతో పాల్గొన్నారు.

ఈ మహాసభల వలన తెలుగు వారిలో భావ సమైక్యత సాదించటంతో బాటు తెలుగు భాష భారతదేశంలో హిందీ తర్వాత ప్రధానమైన జాతీయ భాష అని ప్రపంచానికి చాటి చెప్పటం జరిగింది.

అంతర్జాతీయ తెలుగు సంస్థ ఆవిర్భావం

"తెలుగు సంస్కృతీ సాహిత్యాల పఠన పాఠనాదుల పరిశోధనలను, యితర రాష్ట్రాలలో, యితర దేశాలలో వున్న తెలుగు వారితో-తెలుగు అభిమానులతో సాంస్కృతిక సంబంధాలను అభివృద్ధి చేసే నిమిత్తం 'అంతర్జాతీయ తెలుగు సంస్థ"ను నెలకొల్పవలెనని ఇంగ్లాండు నుంచి వచ్చిన ప్రతినిధి శ్రీ జె. పి. ఎల్. గ్విన్ తెలుగు మహాసభలో ప్రతిపాదించారు. అధికార భాష కమిషన్ అధ్యక్షులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్ష స్థానంలో ఉన్నారు. ఈ ప్రతిపాదనను అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధి ఆచార్య కెల్లి బలపరిచారు. ఈ తీర్మానానుసారం నాటి విద్యా సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ మండలి కృష్ణారావుగారి అధ్యక్షతన అంతర్జాతీయ తెలుగుసంస్థ ఏర్పడింది.

ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణం

ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల వలన అమితంగా ఉత్సాహం చెందిన విదేశాంధ్రులు రెండవ ప్రపంచ తెలుగు మహాసభలను విదేశాలలో జరుపుతామని ముందుకు వచ్చారు.

మలేషియావారు తమ దేశంలో జరుపుతామనీ-మారిషస్ వారు తమ దేశంలో జరుపుతామనీ ఉత్సాహం చూపారు. తెలుగువారు అధిక సంఖ్యలో వున్న మలేషియాలో (లక్షా యాభై వేలమంది) రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వానసంఘ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఆనాటి విద్యాశాఖమంత్రి, మా నాన్నగారు శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు. ఆయన చేతుల మీదుగా యీ మహత్తర కార్యక్రమం జరగడం వలన నేను కూడా