పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ప్రపంచాన ప్రసరించిన తెలుగు వెలుగు

1990 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య యితర రాష్ట్రాలలోనూ, యితర దేశాలలోనూ వున్నవారిని కలుపుకుంటే తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఆరు కోట్లు వుండొచ్చు. భారతదేశంలో హిందీ ప్రథమ స్థానం ఆక్రమిస్తే తెలుగు ద్వితీయ స్థానంలో వుంది. ప్రపంచ జనాభాలో భారతీయుల సంఖ్య ఆరవ వంతు అయితే భారతదేశ జనాభాలో ఆంధ్రుల సంఖ్య పదోవంతు వుంది

బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో చాలామంది తెలుగువారు యితర దేశాలకు కార్మికులుగానూ - కూలీలుగానూ తరలి వెళ్ళారు. అక్కడి వ్యవసాయం-పరిశ్రమల పెంపుదలకు శ్రమశక్తిని ధారపోస్తూ స్థిరపడటం జరిగింది.

మలేషియా, మారిషస్, బర్మా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఫిజీవంటి దేశాలకు అలా వలస వెళ్ళిన వారు అక్కడ రబ్బరు తోటల్లో, కాఫీ తోటల్లో, చెరుకు తోటల్లో, పారిశ్రామిక కేంద్రాల్లో పనిచేస్తూ కూడా తమ స్వభాషా, సంస్కృతీ, సంప్రదాయం పరిరక్షించుకునేందుకు తపిస్తూ ఆంధ్ర సంఘాలను ఏర్పరచుకున్నారు.

విశ్వాంధ్ర హృదయబంధం


ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రెండు శతాబ్దాలపాటు వేర్వేరు పరిపాలనలలో విభిన్నసంస్కృతుల ప్రభావానికిలోనైన తెలుగు వారిలో భావసమైక్యత లోపించింది. తెలుగు వారం మనమంతా ఒక్కటే అన్న సమైక్య భావం కొరవడి రెండు వేర్పాటు ఉద్యమాలు ఆంధ్రా తెలంగాణాలుగా రాష్ట్రం విడిపోవాలంటూ ప్రజ్వరిల్లాయి.

ఈపరిస్థితుల్లోయిటు స్వరాష్ట్రంలోని ఆందోళనలను ఉపశమింపచేసేందుకు, అటు యితర దేశాలలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ వున్న తెలుగువారి ఆశలకూ, ఆశయాలకు ఒక ఆకృతితెచ్చి భాషా సంస్కృతుల ప్రాతిపదికమీద భావసమైక్యతను సాధించేటందుకు "ప్రపంచ తెలుగు మహాసభలను" జరపాలనే నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది.


తెలుగుజాతి చరిత్రలో ఒక మహెూజ్వల ఘట్టానికి నాంది పలుకుతూ 1975 ఏప్రిల్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ప్రథమ ప్రపంచ తెలుగుమహాసభలు సుమారు 20 లక్షల మంది ప్రజలు పాల్గొనగా వైభవంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగాయి.