పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మారిషస్ లో తెలుగు తేజం

ఒక్క సంగీతమేదో పాడునట్లు భా

షించు నప్డు విన్పించు భాష

విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు స్ప

ష్టో చ్చారణంబున నొనరు భాష

రసభావముల సమర్పణ శక్తియందున

నమరభాషకు దీటైన భాష

జీవులలోనున్న చేవయంతయు చమ

త్కృతి పల్కులన్ సమర్పించు భాష

భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి
భాషయన నిద్దియని చెప్పఁబడిన భాష
తనర ఛందస్సులోని యందమ్ము నడక
తీర్చి చూపించినట్టిది తెలుగు భాష

తెలుగుభాష సుమధుర మాధుర్యాన్ని సొగసైన ఇంపుసాంపుల్ని వర్ణిస్తూ కళ్ళకు కట్టినట్టు కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి హృదయాంత రాళాలలో నుండి వెలువడిన హృద్యమైన పద్యమది.

పంచదారకన్న -- పనసతొనలకన్న
కమ్మని తేనెకన్న -- తీయని తెలుగు మిన్న

అన్న భావన మన మదిని పులకరింప చేస్తుంది. వొడలు జలదరింప చేస్తుంది. తెలుగు అనగానే మన సంస్కృతి, మన జాతి ఔన్నత్యం, మన చరిత్ర ఒక్కసారి స్పురణకు వచ్చి ఏదో మధురానుభూతి మనల్ని ఆవహిస్తుంది. ఏవేవో దివ్యలోకాలకు ఆ అనుభూతి మనల్ని తీసుకుని వెళ్తుంది.

మనోభావాల్ని చక్కనైన రీతిలో ఎదుటివారికి వ్యక్తపరచటానికి భాష ప్రధానమైన