అనుచ్ఛేదము 17. (i) స్వతంత్రముగగాని, ఇతరులతో చేరిగాని, ఆస్తిని కలిగియుండుటకు ప్రతివ్యక్తికిని హక్కు గలదు.
- (ii) విధి విరుద్ధముగా ఏ వ్యక్తిని గాని ఆస్తిభ్రష్టునిగ చేయరాదు.
అనుచ్ఛేదము 18. ప్రతి వ్యక్తికిని భావస్వాతంత్ర్య, అంతఃకరణస్వాతంత్ర్య, మతస్వాతంత్ర్యములకు హక్కు గలదు. తన మతమును ప్రత్యయమును మార్చుకొనుటయును, ఒంటరిగ గాని, సాంఘికముగ గాని, బహిరంగముగను, ఆంతరంగికముగను ఉపదేశ, అనుష్ఠాన, ఆరాధన, ఆచరణలచే తన మతప్రత్యయములను వ్యక్తీకరించుటయును, ఈ హక్కులో నిమిదియున్నవి.
అనుచ్ఛేదము 19. ప్రతి వ్యక్తికిని అభిప్రాయస్వాతంత్ర్యమునకును, భావ ప్రకటన స్వాతంత్ర్యమునకును, హక్కు గలదు. పరుల జోక్యము లేక, స్వాభిప్రాయమును గలిగియుండుటకు స్వాతంత్ర్యమును, రాజ్యసీమానిరపేక్షముగా, నెట్టి మధ్యస్థ మార్గముననైన సమాచార, సంసూచనలను అన్వేషించుటకు, పొందుటకు, ఉపపాదించుటకు, స్వాతంత్ర్యమును ఈ హక్కులో నిమిదియున్నవి.
అనుచ్ఛేదము 20. (i) ప్రతి వ్యక్తికిని శాంతియుత సమావేశమునకు, సాహచర్యమునకు హక్కు గలదు.
- (ii) ఎవ్వరినిగాని, ఒక సమాజమునకు చేరియుండవలెనని నిర్బంధింపగూడదు.
అనుచ్ఛేదము 21. (i) ప్రతి వ్యక్తికిని, స్వయముగా గాని, స్వేచ్ఛగా ఎన్నుకొనబడిన ప్రతినిధుల ద్వారా గాని, తన దేశ ప్రశాసనమునందు పాల్గొనుటకు హక్కు గలదు.
- (ii) ప్రతి వ్యక్తికిని తన దేశమునందలి లోకసేవలలో సమాన ప్రవేశాధికారము గలదు.
- (iii) ప్రభుత్వాధికారమునకు ప్రజల సంకల్ప శక్తియే ఆధారమై యుండవలెను. సార్వజనీనము సమాన మతాధికారయుతమునగు, నియతకాలిక యథార్థ నిర్వాచనలలో ప్రజల సంకల్పము సువ్యక్తము కావలెను. ఈ నిర్వాచన, గూఢశలాకాపద్ధతి ననుసరించి గాని, తత్సమానమయిన స్వేచ్ఛా మతదానప్రక్రియననుసరించి గాని, జరుగవలెను.
అనుచ్ఛేదము 22. సంఘమునందలి సభ్యుడుగా, ప్రతి వ్యక్తికిని సామాజిక రక్షకు హక్కు గలదు. రాష్ట్రీయప్రయత్న, అంతర్ రాష్ట్రీయ