పుట:మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటన.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుచ్ఛేదము 17. (i) స్వతంత్రముగగాని, ఇతరులతో చేరిగాని, ఆస్తిని కలిగియుండుటకు ప్రతివ్యక్తికిని హక్కు గలదు.

(ii) విధి విరుద్ధముగా ఏ వ్యక్తిని గాని ఆస్తిభ్రష్టునిగ చేయరాదు.

అనుచ్ఛేదము 18. ప్రతి వ్యక్తికిని భావస్వాతంత్ర్య, అంతఃకరణస్వాతంత్ర్య, మతస్వాతంత్ర్యములకు హక్కు గలదు. తన మతమును ప్రత్యయమును మార్చుకొనుటయును, ఒంటరిగ గాని, సాంఘికముగ గాని, బహిరంగముగను, ఆంతరంగికముగను ఉపదేశ, అనుష్ఠాన, ఆరాధన, ఆచరణలచే తన మతప్రత్యయములను వ్యక్తీకరించుటయును, ఈ హక్కులో నిమిదియున్నవి.

అనుచ్ఛేదము 19. ప్రతి వ్యక్తికిని అభిప్రాయస్వాతంత్ర్యమునకును, భావ ప్రకటన స్వాతంత్ర్యమునకును, హక్కు గలదు. పరుల జోక్యము లేక, స్వాభిప్రాయమును గలిగియుండుటకు స్వాతంత్ర్యమును, రాజ్యసీమానిరపేక్షముగా, నెట్టి మధ్యస్థ మార్గముననైన సమాచార, సంసూచనలను అన్వేషించుటకు, పొందుటకు, ఉపపాదించుటకు, స్వాతంత్ర్యమును ఈ హక్కులో నిమిదియున్నవి.

అనుచ్ఛేదము 20. (i) ప్రతి వ్యక్తికిని శాంతియుత సమావేశమునకు, సాహచర్యమునకు హక్కు గలదు.

(ii) ఎవ్వరినిగాని, ఒక సమాజమునకు చేరియుండవలెనని నిర్బంధింపగూడదు.

అనుచ్ఛేదము 21. (i) ప్రతి వ్యక్తికిని, స్వయముగా గాని, స్వేచ్ఛగా ఎన్నుకొనబడిన ప్రతినిధుల ద్వారా గాని, తన దేశ ప్రశాసనమునందు పాల్గొనుటకు హక్కు గలదు.

(ii) ప్రతి వ్యక్తికిని తన దేశమునందలి లోకసేవలలో సమాన ప్రవేశాధికారము గలదు.
(iii) ప్రభుత్వాధికారమునకు ప్రజల సంకల్ప శక్తియే ఆధారమై యుండవలెను. సార్వజనీనము సమాన మతాధికారయుతమునగు, నియతకాలిక యథార్థ నిర్వాచనలలో ప్రజల సంకల్పము సువ్యక్తము కావలెను. ఈ నిర్వాచన, గూఢశలాకాపద్ధతి ననుసరించి గాని, తత్సమానమయిన స్వేచ్ఛా మతదానప్రక్రియననుసరించి గాని, జరుగవలెను.

అనుచ్ఛేదము 22. సంఘమునందలి సభ్యుడుగా, ప్రతి వ్యక్తికిని సామాజిక రక్షకు హక్కు గలదు. రాష్ట్రీయప్రయత్న, అంతర్ రాష్ట్రీయ