పుట:మాటా మన్నన.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయకపోతే చాలా దెబ్బతింటాం. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు తనకు కొందరు పనివారు కావాలని ప్రకటించాడనుకోండి. అప్పుడతను వచ్చిన దరఖాస్తుదారులను వరసనే పిలచినప్పుడు వారు సరిగా సంభాషణ చేయలేకపోతే వారు వచ్చిన దారి పట్టవలసిందే. నేర్పు లేనిదే ఏమీ ప్రయోజనం లేదు. యజమాని పలకరించగానే తనయందు సద్భావము కలిగేటట్లుగా సమాధానం చెప్పవలసి వస్తుంది. అట్లా చెప్పినవాడే జయం పొందగలడు. అట్లా సరిగా సమాధానం ఎంతమంది చెప్పగలరు?

అట్లాగే వర్తకంలోకూడా. వస్తువులను అమ్మటంలో నేర్పరత్వం అంటే మాటకారితనం అన్నమాట. షాపులోకి వచ్చినవారిని మర్యాదగా పలకరించి, వారు అడిగే వస్తువుల నాణెమును గురించి, ధరలను గురించి వారికి నచ్చేటట్లు చెప్పి, వారిని కొనేటట్లు చెయ్యాలి. వారితో వాద వివాదాలు పెట్టుకోరాదు. వ్యాపారమంతా సంభాషణా చాతుర్యంమీదనే ఆధారపడివుంది.

వైశ్యులకు ఇతరులకూ వర్తకంలో తేడా ఇదే. వారివలె మర్యాద మన్ననగ, ఓపికతో వచ్చినవా రందరితో మాట్లాడగల నేర్పు ఇతరులకు తక్కువ.

పెట్టుబడికంటె వర్తకులకు ముందు మాటల పొందిక ముఖ్యమని గుర్తించాలి.

ఇతర వృత్తులవారుకూడా రాణించాలంటే సంభాషణ చక్కగా తెలిసినవారై ఉండాలి. బాగా చదువుకున్న వారి కంటె, బాగా మాట్లాడటం నేర్చినవారే తమ పనులలో

8