పుట:మాటా మన్నన.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంతా కాదు; అత్యధికమైనది. రచనద్వారాకూడా అభిప్రాయ ప్రకటన జరిగేమాట వాస్తవమే. మన ప్రాచీన సాహిత్యమే ఈనాటి సంస్కారాని కంతకూ కారణం. కాని ఎందరు మనలో రచయితలు? కనుక మన అభిప్రాయాలు ఇతరులకి తెలియజేయటానికి, పరుల ఆలోచనలు తెలుసుకోవటానికి సంభాషణ తప్పనిసరి అని గ్రహించాలి. సంభాషణ ఒక లలితకళ. అది ఒక కళేకాదు ఒక శాస్త్రం కూడా, మంచి మాటకారులం కావాలంటే మనం కొన్ని నియమాలు అభ్యసించాలి. మనలో కాస్తఓపిక, ధ్యానము, పరిశీలన ఉంటే దీన్ని అభ్యసించటం ఏమంత కష్టంకాదు.

సంభాషణ మనకు తెలుసుననీ అది సహజంగానే అలవడుతుందనీ అనుకుంటాం. కనుక వేరే నేర్చుకోవలసిన అవసరం లేదని తలుస్తాం. బాగామాట్లాడటం. సంభాషించటం ఒకటని అనుకోకూడదు. బాగా మాట్లాడేవారిలో చాలామంది బాగా సంభాషించలేరు. గొప్ప గొప్ప కవులుకూడా మంచి సంభాషణ కర్తలుకారు. మంచి సంభాణ కర్తలతో మనము మాట్లాడుతున్నప్పుడు మన అశక్తత గోచరం అవుతుంది. అప్పుడు వారి ఎదుట మూగవారివలే వుండి సిగ్గుపడవలసి వస్తుంది.

సంభాషణను అయిదు విధాలుగా విభజింపవచ్చు. వర్తక వాణిజ్యాల సంబంధం, సాంఘిక సందర్భాలు, మిత్రులమధ్య, పండితగోష్ఠి, నిత్య వ్యవహారాలు,

మొట్ట మొదటగ మనం వ్యాపార సంబంధమైన సంభాషణసంగతి ఆలోచించుదాం. సరీగా సంభాషణ

7