పుట:మాటా మన్నన.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అ. వె. అల్పుఁడెపుడు బల్కు నాడంబరముగాను
        సజ్జనుండు పల్కుఁ జల్లఁగాను
        కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
        విశ్వదాభిరామ వినుర వేమ !

       “అమలమైన పలుకు లభిషేక వారిధి" --
       పక్కి తెలిసి పలుక నొక్క వాక్యమె చాలు
       పెక్కు లేల? వట్టి ప్రేల్చుటేల ! --

       మాటల మాటలు వచ్చును
       మాటలనే గల్గుచుండు మణిమంత్రంబుల్
       మాటల పొందిక తెలిసిన
       మాటలనే ముక్తి కలుగు మహిలో వేమా!

       వాఙ్మాధుర్యాన్నాన్య దస్తి ప్రియత్వం
       వాక్పారుష్యా చ్చోపకారో౽పి నష్టః
       కింత ద్బ్రూమః కోకిలే నోపవీతం,
       కోవాలోకే గార్దభస్యాపరాధః

ఉ. భూషలుగావు మర్త్యులకు | భూరిమయాంగదతార హారముల్
    భూషితకేశ పాశమృదు| పుష్పసుగంధ జలాభిషేకముల్
    భూషలుగావు పూరుషుని| భూషితుఁ జేయుఁబవిత్రవాణివా
    గ్భూషణమే సుభూషణము | భూషణముల్ నశియించు నన్ని యున్

60