పుట:మాటా మన్నన.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంభాషణా ప్రయోజన ప్రాముఖ్యాలు

ఆదిమ సమాజమునుండి అత్యున్నత స్థితిగాంచిన నేటివరకు తన అభిప్రాయాలను తెలియ జేయటానికి మానవుడు ఎడతెగని కృషిచేశాడు. పశు పక్ష్యాదులు కూడా తమతమ అరుపులవల్ల తమ భావాలను ఇతర జంతుజాలానికి తెలుపుతవని కొందరు ఆలోచనాపరులు అంటున్నారు. అనటమే కాదు; పూర్వము పశుపక్షుల భాషలను మానవులు కొందరు నేర్చినట్లు గ్రంధాలద్వారా తెలుస్తున్నది. పాశ్చాత్యులు అధికపరిశ్రమ చేసి వానరాది జంతువుల భాషలను తెలుసుకొన్నట్లు తెలుస్తున్నది.

ఆది మానవుడు ప్రధమంగా ధ్వనుల వల్లనే తన అభిప్రాయాలను తెలియపర్చాడు. కనుక మానవుడు సంభాషణవల్లనే తన అభిప్రాయాలను ఇతరులకు తెలియ జేయును. తన అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పటమే సంభాషణ. కనుక దీన్ని సాధ్యమైనంతవరకు జయప్రదంగా జరుపుటకు ఎందుకు కృషి చేయకూడదు? సంభాషణ అంటే మనస్సుల కలయిక అని నానుడి పుట్టింది. కనుక ఆ కలయికవలన కలిగే ఉత్తమ లాభాన్ని మనము ఎందుకు పొందగూడదు?

పరస్పర మన సమ్మేళనవల్ల మానసికాభి వృద్ధి పొందటమే సంభాషణా ప్రయోజనం. ఈ ప్రయోజనం పొందుటకు అనేకులతో సంభాషించు టవసరం.

5