పుట:మాటా మన్నన.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరియైన సంభాషణ గురించి తుదిమాట చెప్తున్నాను. అది అధికంగా నిస్వార్ధం, నిష్కాపట్యంమీద ఆధారపడి ఉంటుంది. ఇతరుల ఆనందాన్ని గురించి ఆలోచించటం సిగ్గుతో మాట్లాడలేని వారిని ప్రోత్సహించి మాట్లాడేటట్లు చేయటం, తన లోపాలను దిద్దుకోవటం. నీ విధిని నీవు నిర్వర్తించటం కర్తవ్యం.

నిత్యమూ కొత్త సంగతులు తెలుసుకోవటం, నూతన అభిప్రాయాలు గ్రహించటం అవసరం. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇతరులు నీ మాటలను చెవి యుగ్గి వింటానికి ఇష్టపడతారు. ఇది కొంచెం కష్టమైనపని కావచ్చు. కాని అభివృద్ధి నిరంతరం పరిశ్రమవలనే లభిస్తుంది. నిత్యమూ చదవటం, లోకంలో జరిగే సంగతులను సరిగా గ్రహించటం, కళ్ళనూ చెవులనూ సరిగా ఉపయోగించటం చేయవలసిన పని. పంచేంద్రియాలను నీ అభివృద్ధికై ఉపయోగించాలి. ఈ మాదిరి సాధన నీ అభివృద్ధికి ఆధారభూతంగా ఉంటుంది.

కనుక పరిశ్రమ అవసరం. కొందరు సహజంగా ప్రతిభావంతులు. కానివారు కొద్దిమంది మాత్రమే. సంభాషణసరిగా చేయాలనుకునే ప్రతివారు ప్రయత్నించాలి. అట్లా కృషిచేసే మనిషి. నిజంగా జయం గాంచగలడు. నిన్ను గురించి గాక ఇతరుల గురించే ఆలోచిస్తే పయోజనం ఏమిటి? కనుక ఏవిధంగా సంభాషణలో ఇతరులను ఆనందింప చేయగలవో ఆ సంగతులను నేర్చుకుంటే నీవు మంచి సంభాషణ కర్తవు కాగలవు.



57