పుట:మాటా మన్నన.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిన్నా పెద్దా కలసి ఏదైనా ఒక విషయాన్ని గురించి తర్జన భర్జన చేస్తున్నప్పుడు పెద్దలు నిగ్రహం చూపటం అవసరం. వారు తమ స్వానుభవంతో, 'ఆబ్బాయీ, నీ వేమి మాట్లాడుతున్నావో నీకు సరిగా తెలియదు.' ఈ మాదిరిగా మాట్లాడటం ఏ కుర్రవాడి కయినాసరే వ్యతిరేకభావాన్ని కలిగిస్తుంది. అనుభవమే ప్రధానం కాదని వా రనుకొంటారు. నే నీ విధంగా అనుకొంటానికి నాకు హక్కు ఉన్నదని యువజనులు అనుకొంటారు. పెద్దలు తమ అనుభవాన్ని పురస్కరించుకొని, విమర్శించినప్పుడు పిన్నలు చాలా బాధపడతారు. కనుక పెద్దలు వారితో ఘర్షణ లేకుండా సమరసంగా పోవటం ఉచితం.

పిల్లల్ని పిల్లలగా గాక, మిత్రులనుగా భావించినట్లయితే తలిదండ్రులకు తగాదాలు రావు.

బాల్యంలో రాజుగానూ, కౌమారంలో మిత్రుని గానూ, పాటించవలసినదని నీతిశాస్త్రం చెపుతున్నది. కాని తండ్రులు సంతానాన్ని తమ ఆస్థిపాస్థులవలె భావించి వారిని స్వేచ్చగా పెరగనివ్వకుండా అడ్డు పడుచున్నందువలననే ఈ అనర్ధకాలు వస్తున్నవి.

"They have come through you not by you” పిల్లలు తలిదండ్రులద్వారా వచ్చారు. కాని, తలిదండ్రులవల్ల రాలేదన్న ఖలీల్ జిబ్రాన్ అన్నమాట సత్యం.

తానిట్లా చేశానని తలచి, తన కుమారుడు కుడా అట్లాగే చెయ్యాలని చెప్పడం సముచితంకాదు. వారి అనుభవం నేటికి సరిపోతుందని గ్రహించాలి. ఈనాటి కాల

48