Jump to content

పుట:మాటా మన్నన.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చితులు మాట్లాడుకోరు. మూడోవ్యక్తి ఎవరో వచ్చి వారి నిద్దరిని పరిచయం చేసినప్పుడే వారు పలకరించుకొనేది.

రైళ్ళల్లోనూ, బస్సులలోనూ, ప్రయాణం చేసేటప్పుడు పుస్తకమో, పత్రికో పుచ్చుకొని కాలక్షేపం చేయటం సహజం. కొంతసేపు చదవగా విసుగుపుడుతుంది. అంతట ప్రక్కనున్నవారిని పలకరించటం తటస్థిస్తుంది. మీ దేవూరు? ఎక్కడనుండి వస్తున్నారు? ఇట్లా ప్రశ్న పరంపరలు సాగుతవి. పట్టణపువారై తే పల్లెటూరి వారిని వారి ఆచార విచారాలను గురించి, వారి కష్టసుఖాలను గురించి, తెలుసుకొన ప్రయత్నిస్తారు.

అట్లాగే ఒకరు మరొకరినికాని అదే గొడవగా ప్రశ్నించే మనిషిని చూస్తే కష్టంగానే ఉంటుంది. అవతల వారి అభిప్రాయాన్ని గమనించి మాట్లాడాలి. .

ప్రపంచం ఒక నాటకరంగం. ఇందులో పాత్రలను పరికించాలంటే ప్రయాణాల్లోనే చూడాలి. భిన్న భిన్న దృక్పథాలు కలవారిని కలుసుకుంటానికి అవకాశం చిక్కుతుంది. దేశాటనమువల్ల మంచి అనుభవం కలుగుతుంది. రైల్లోకూడా మన ముక్కూ ముఖము ఎరుగనివారు మన అవసరాలని గుర్తించి సాయపడుతుంటే, వారియెడల మనకు ఎంతో ప్రేమ కలుగుతుంది. తర్వాత వారి ఊరూ పేరూ తెలుసుకొని వారిని బంధువులుగా భావిస్తాము. ఆ నూతన స్నేహితులు కొందరు మన రక్త బంధువుల కంటే ప్రేమాస్పదు లవుతారు.

44