పుట:మాటా మన్నన.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“మీరు అన్నీ తెలిసినవారు, మీరు శోకించరాదు” అంటారు. ఇంకొకరు.

ఇవన్నీ దుఃఖాన్ని పెంచేవే. వారు వచ్చింది దుఃఖోపశమనం చేయటానికి, వచ్చినదానికి భిన్నంగా మాట్లాడటం జరుగుతుంది. తమ ఉనికి వల్లనే దుఃఖోపశమనానికి దోహదం కలుగ చేయాలి. మాటలవల్ల కలగదు.

కాల పురుషుడే ఈ గాయాన్ని మార్చాలి. మానవులు చేయలేరు. మరుపుఅనే మహాభాగ్యాన్ని ఈశ్వరుడు మనకు ప్రసాదించాడు. 'అందువల్ల నే మనం జీవించ కల్గు తున్నాం .

గమనించవలసింది ఏమిటంటే, అనారోగ్యంగా ఉండనీ, ఆపదలో ఉండనీ వారిని చూడటానికి వెళ్ళినప్పుడు మన మాటలు వారి దుఃఖాన్ని మరపించి కొంచెమైనా భారం తగ్గి కాస్త ఊపిరి పీల్చుకొనేటట్లు చెయ్యాలి.

మనం మాట్లాడి వెళ్ళినతర్వాత ఈ వ్యక్తివల్ల కాస్త శాంతి చేకూరింది అనుకొనేట్లుండాలి.

యాదృచ్చిక సంభాషణ :

తెలియనివారితో మాట్లాడకూడదని నేటి యువజనులలో ఒక భావం పెంపొందింది. కాని మన ప్రాచీనులు ఇందుకు భిన్నంగా ఉండిరి. వారు అందరిని ఆప్యాయతతోనే పలకరించేవారు. పలకరించటమేకాదు; వారి పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకొనే వారు.

ఆంగ్లేయుల సంప్రదాయం దీనికి భిన్నం . ఒకరైలులో ఇద్దరు ఆంగ్లేయులు కలిసి ప్రయాణం చేస్తూఉన్నా, అపరి

43