పుట:మాటా మన్నన.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శోకావస్థను గురించి మనం మాట్లాడటం మంచిది కాదు. దుఃఖంలో వున్నవారిని గురించి మరింత దుఃఖపెట్టటం అవుతుంది. మనం వారి శోకభారాన్ని గమనించే వచ్చామని వారికి తెలుసు. ఆ బాధ భరించలేక వారే మాట్లాడతారు ఇతరులతో చెప్పుకోవటంవల్ల శోకభారం తగ్గుతుంది. ఆపని వారే చేస్తారు. మన ఉనికే అక్కడ అవసరం; మనమాట కాదు. అందుచేతనే పూర్వకాలంలో ఎవరైనా పోతే పెద్దలు వారింట్లో దుఃఖోపశమనం కలిగేవరకు ఉండేవారు.

తన తండ్రి మోతీలాల్ నెహ్రూ అస్తమించినపుడు గాంధీమహాత్ముడుకి తను గృహంలో వుండుట తమ కెంతో దుఃఖోపశమనం కలిగించిందని జవహరలాల్ తనఆత్మకధలో చెప్పుకొన్నాడు.

"Speak but little and well if you would be esteemed a man of merit" --- Trench.

మన శక్తియుక్తులను బట్టి ఏదో లోకపు సంగతులను చెప్పి వారి దుఃఖాలను మరపించటానికి మరొకవైపుకు మార్చాలి.

కాని ఆట్లా చేయరు.

ఒక వృద్ధుని కుమార్తె పోయిందనుకొండి.

"ఒకాయన మీరు చాలా దురదృష్ట వంతులండీ" అంటాడు.

మరొకాయన “మీరు కాళ్ళు కడుక్కొని కూర్చున్నారు. మీకీ సమయంలో దుఃఖంపెట్టి పోయింద"ని అంటాడు.

42