పుట:మాటా మన్నన.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగా వారి ఆరోగ్యాన్ని గురించి, వారి బాధను గురించి మాట్లాడాలి.

రోగులు పరాయిచోట ఉన్నప్పుడు వారు సహజంగా తమ కుటుంబాన్ని గురించి, స్నేహితులగురించి విన కోరతారు. సభలు, సమావేశాలు, విందులు, వినోదాలూ మొదలైనవాటిని గురించి కూడా తెలుసుకొన కుతూహల పడతారు.

దీర్ఘ రోగులు తరచు మిత్రులను చూడగోరుతారు. వచ్చినవారు వారిని ఎట్లా సంతోష పెట్టాలా అను సంగతిని ఆలోచించాలి. వారికి ఇష్టమైన మాటలను మాట్లాడాలి. వారి అభిరుచినిబట్టి మాట్లాడాలి. వారికి కులాసా కలిగించాలి. "Discreation of speech is more than eloquence; and to speak agreebly to him with whom we deal is more than to speak in good words or in good order" --Bacon,

రోగివద్ద దుఃఖకరమైన విషయాలు, అనిష్టకరమైన సంగతులు మాట్లాడరాదు. ప్రపంచంలోవున్న దుఃఖాలను గురించి అతని ఎదుట ఎత్తరాదు, దుఃఖంలో కొట్టుమిట్టాడు వారితో ఇంకా దుఃఖాలను గురించి మాట్లాడటం అవివేకం.

రోగి తనవల్ల కాస్త సుఖసంతోషాలు పొందేటట్లు భావించి మాట్లాడాలి.

శోకంలో వున్నవారి సందర్భంలోకూడా ఈ సంగతినే పాటించాలి. ఆపదలో వున్న వారిని చూడటం మన ప్రధాన ధర్మంగా భావించి, ప్రధమంగా చూడాలి, వారి

41