పుట:మాటా మన్నన.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనం తరచు రోగులను చూచుటకో బిడ్డనో భర్తనో భార్యనో పోగొట్టుకున్నవారిని పరామర్శించుటకో వెళ్ళవలసి వస్తుంది. అటువంటప్పుడు వారితో ఎట్లా మాట్లాడాలి-అన్నది తేలికైన సంగతి కాదు. ఆపదలోవున్న మన బంధుమిత్రుల సానుభూతికై అనగా వారి దుఃఖ నివారణకై వెళతాం. వారి అనారోగ్యాన్ని గురించిగాని, ఆపదను గురించిగాని మాట్లాడటం తెలియదు. వారిని ఎట్లా ఓదార్చాలో బోధపడదు.

ఒక దీర్ఘరోగి ఆస్పత్రిలోఉండి కోలుకొనే సమయంలో మనం చూచినట్లయితే అతనికి ప్రయోజనం కలుగుతుందని తలుస్తాం. మనం ఆ రోగియెడల సానుభూతితోనే వెళతాం. అతనికి ఏమికావాలో కనుక్కొన కోరుతాం. పుస్తకాలు కావాలా, పత్రికలు కావాలా, ఉత్తరాలు వ్రాసిపెట్టాలా"అని అడగటం మంచిది.

కొందరు వచ్చినవారు వచ్చినట్లుండక రోగి స్థితిగతులు గమనించకుండా తమ సొద చెప్పుకొని ఆరోగిని విసిగించేవారుంటారు. అసలు రోగులకు ఇటువంటి విషయాలంటే చిరాకు. వారు అసలు బాధలో ఉన్నారు. వారిని మరింత బాధ పెట్టటమా ? మనం ఉన్న కాసేపైనా వారిని బాధ మరచేటట్లు చెయ్యాలి.

రోగులు తరచు తమ కష్టాలు, తమ బాధలు చెప్పుకోవటం సహజం. ఏమన్నా బాధా? అని అడిగితే వారికి బాధేమైనా ఉంటే దాన్ని గురించి చెపుతారు. కనుక జబ్బుగా ఉన్నవారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ప్రధ

40