పుట:మాటా మన్నన.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సినిమాలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సంఘాలు, స్థానిక సంస్థలు మొదలగునవి ఎన్నో ఉన్నవి.

స్త్రీలలో విద్యా వ్యాప్తి ఆర్ధికస్తోమతు మొదలగు అవకాశాలు లభిస్తే పురుషులవలే వారికి అభిరుచి కలుగుతుంది. నేడు యువతులు కొందరు నూతన అవకాశాలు పొంది గౌరవాలు పొందుతున్నారు.

స్త్రీలుకూడా నేటిపరిస్థితి గమనించి పిల్లలే ప్రపంచం ఇల్లే స్వర్గమని, కూపస్థ . మండూకంలాగా గాక, ప్రపంచ ధోరణిని గ్రహించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు తమ గొడవలను మాని, లోక వ్యవహారాలను మాట్లాడాలి. సంభాషణవలన ప్రయోజనాన్ని పొందాలి. .

కనుక వారుకూడా సంభాషణా చాతుర్యాన్ని అలవరచు కోవాలి.

నేడు మనం తానీషాలనాడువలె లేము. రాజులు, రాణులూ పోయారు. బ్రాహ్మణులూ శూద్రులూ అనే బేధం పోయింది. అంటరానితనం అడుగంటింది. ఇంతే కాదు. ప్రపంచమంతటా ప్రజాస్వామ్యము ఏర్పడింది. స్త్రీ పురుషులు సమానమన్న మాట పాటించ బడుతుంది.

స్త్రీ పెరగాలి - పెంచాలి.

ఆపన్నులతో:

మానవుడు సంఘజీవి. ఈ లోకం కేవలం ఆనంద ప్రదమైనది కాదు. సుఖదుఃఖాలతో కూడుకున్నది. కనుక

39