పుట:మాటా మన్నన.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవకాశం లేకుండా చేశారు మొగ మహారాజులు. ఇల్లూ పిల్లలు, భర్త ఇదే వారి ప్రపంచమన్నట్లు చేశారు. అటువంటప్పుడు ఎవరో కొందరికి తప్ప అందరికీ ఆలోచన అదే.

ఈ సంగతులే మనం ప్రమదావనంలోనూ (ఆంధ్ర ప్రభ వారపత్రిక) వనితాలోకంలోనూ (ఆంధ్రవారపత్రిక) చూస్తూవుంటాము. స్త్రీల మనస్తత్వాన్ని బాగాగుర్తించింది చిన్నదైనా మాలతీ చందూర్. ఆమె ఈనాడు స్త్రీలకు స్నేహితురాలు, తత్వవేత్త, గురువు (Friend, philospher and guide) అది ఒక అదృష్టము. స్త్రీలు ఆంధ్రప్రభను కధలకంటే ప్రమదావనంకొరకే తెప్పిస్తారంటే అతిశయోక్తి కాదు.

స్త్రీలు గృహవిషయాలలో పడి విసుగుపుట్టి కాస్త తీరిక కలగ్గానే కులాసా పొందగోరుతారు. అప్పుడు వారు మరొకరిని కలుసుకొన్నప్పుడు పిచ్చాపాటి మాట్లాడు కోవటంలో నూతన సంగతులు తెలుసుకుంటూ ఉంటారు. చదువు నేర్చినవారు, విద్యార్థినులు పుస్తకాలను గురించీ రాజుకీయాలను గురించి, ఈనాటి సమస్యలను గురించి మాట్లాడు కొంటారు. సహజంగా వారు వివాహాలను గురించి పిల్లలను గురించీ చర్చించుకొంటారు. అప్పుడు అమ్మా! ఈనాడు మంచి సంభాషణ జరిగింది. అదృష్టవంతులము అనుకొంటారు. ఈనాడు కాస్త తెలిసిన స్త్రీలు మాట్లాడుకోవలసిన సంగతులు అనేక మున్నాయి. రేడియో కార్యక్రమాలు,

38