పుట:మాటా మన్నన.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీల సంభాషణ:

స్త్రీలు తమలోతాము మాట్లాడుకొనేటప్పుడు సాధారణంగా దిగువస్థాయిలోనే మాట్లాడుకుంటారని విచారకరంగా చెప్పకతప్పదు. అసలు వారు స్వవిషయాలు చెప్పుకొనే పద్ధతికి అలవాటు పడ్డారు. బజారులోగాని, బుస్సులో గాని ఎక్కడైనా స్త్రీలు మాట్లాడుతుంటే వినండి, తరచుగా వినబడే దేమంటే: "ఆమెతో నేనామాటన్నాను” “తర్వాత ఆమె నాతో అన్నది” ఆమె అన్నది - నేను అన్నాను” ఇదే ధోరణి. ఇదంతా ఒక కధగాతోస్తుంది. తమస్థాయిలో వారు చెపుతారు. సంభాషించరు. ఇదంతా బాతాఖాని, ఇది సంభాషణ కాదు. ఇటువంటి మాటలవల్ల స్త్రీలు పొందేదేమీ లేదు. ఇట్లా చెప్పిందే చెప్పటం ఒక పద్ధతి. మరొకటి, పిల్లలను గురించి చీరలను గురించి అధికం, అనంతరం కొద్దిగా గృహకృత్యాలను గురించి.

సహజంగా స్త్రీలు మాట్లాడేదానిలో తెలుసుకొనేటందుకు ఆనందించేటందుకు ఏమీ ఉండదు, ఉబుసుపోకకు చెప్పుకొనే కబుర్లు అవి. మనదృష్టిలో ఇవిఅన్నీ అల్పమే. కానీ స్త్రీలదృష్టిలో వీటికంటే గొప్పసంగతులు లేవని అనుకోవాలి. వారు మంచి మంచి చీరలు జాకెట్లు ధరించారంటే వారేకాదు సంతోషించేది, లోకమంతా శోభాయ మానంగా ఉంటుంది. సుందర వస్తువులను చూచి సౌందర్యా రాధకులు ఆనందిస్తారు.

అట్లాగే వారు తమ ఇల్లు వాకిలిని గురించి, అన్న పానీయాలను గురించి గృహోపకరణాలను గురించి, మాట్లాడ

36