పుట:మాటా మన్నన.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంబంధాలు మానాలి స్త్రీలు. ఉభయులు సానుభూతితో ఒకరి అభిప్రాయాలు ఒకరు గ్రహించటానికి ప్రయత్నించాలి.

సంభాషణలో అందరికి ఆమోదప్రదంగా ఉండే విషయాన్ని మాట్లాడాలనేది ప్రధమంగా మనసులో నుంచుకోవాలి. సంభాషణవల్ల ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గ్రహించి, ఒకరినొకరిని అర్థం చేసుకొనేటట్లుండాలి. అన్యధా భావించరాదు.

స్త్రీ పురుషులుకలసి మాట్లాడుతూఉంటే మాధుర్యం ఉట్టిపడేటట్లుండాలి. అది ఒక వింతశోభ, ఉత్సాహము ఆనందానుభవంగా ఉండాలి.

చిన్నారావు (రేమెళ్ళ) కృష్ణాబాయి (తుమ్మల) హేమ (తాతినేని) నేనూ కలసి సంభాషణ చేస్తున్నప్పుడు కాలం సంగతి తెలియనే తెలియలేదు.

కాకినాడలో మధురంగా గడిపాము. అదొక మధుర స్మృతి.

ఒకరి నొకరు అర్థంచేసుకొని పరస్పర మైత్రికలిగి పరస్పరం పెరిగాము.

మాటవల్ల మనస్సు కలియాలి.

నాకు తెలిసిన స్త్రీలల్లో రామతుల భారతీదేవి, ఇల్లిందల సరస్వతీ దేవి. అత్తిలి స్వరాజ్యలక్ష్మి కృష్ణాబాయి గారలు ఉత్తమ సంస్కారులుగ కన్పిస్తారు. వారి ఉనికే ఉత్తమ సంస్కారం కలిగిస్తుంది. వారితో సంభాషించటం సంగతి వేరే చెప్పనక్కరలేదు.

35