పుట:మాటా మన్నన.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతురులుకూడా. వారికి ఒక అహంభావంకూడా ఉంటుంది. తాము చెప్పేది రైటని, ఇతరులు చెప్పబోతే వారి కేమీ తెలియదని అనేస్తారు,

స్త్రీలు సహజంగా లజ్జ బిడియంకలవారు. వారు తమ అభిప్రాయాలను వెల్లడించటంలో వెనుకాడతారు. పురుషులతో వాదిస్తానికి సంశయిస్తారు,

ఆడపిల్లలు యువకులను కదలించి వారి వారి కార్య కలాపాలు వినగోరుతారని అంటారు. అది పాత మాట. పురుషులు స్త్రీల నోటిమాట వింటానికే నేడు ఉబలాట పడతారు. స్త్రీ అనే పేరే మధురం అన్నాడు పురుషుడు. అటువంటప్పుడు ఆమె మాటలకు చెవి కోసుకుంటాడంటే ఆతిశయోక్తి ఏమున్నది. పురుషులు స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. స్థనశల్య పరీక్ష, , అజాగళ స్థనం మొదలగు మాటలేగాక, వారు నొచ్చుకొనేటట్లు మాట్లాడరాదు.

అలాగే స్త్రీలు పురుషులపై సవారీ చేయరాదు.

ఉభయులకు అనుకూలమైన విషయాలమీద సంభాషణ చేయటం మంచిది. ఆ సంభాషణవల్ల వినోదం విజ్ఞానం పొందాలి, అవి సంగీత సాహిత్యాలుగాని సాంఘిక ఆర్ధిక రాజకీయనిషయాలుగాని.

స్త్రీ పురుషులు కలసి మాట్లాడటంలోగల చిక్కు ఏమిటంటే సాధారణంగా హృదయం విప్పి మాట్లాడుకోరు. మగవారు గంభీర హృదయులు, స్త్రీలు మాట్లాడుతూంటే

33