పుట:మాటా మన్నన.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎదుటివారి అభిప్రాయాన్ని విన్నప్పుడే మంచి చెడ్డలు తెలిసేది.

స్త్రీ పురుషుల సంభాషణ:

పురుషులు తరచుగ సంతోషంతో మాట్లాడుకుంటారు. అట్లాగే స్త్రీలు ఇతరస్త్రీలతో సంతోషంగా మాట్లాడుకుంటారు.

పురుషులకు స్త్రీలకు కులాసాగా మాట్లాడుకోవటానికి ప్రత్యేకవిషయాలున్నాయి. వ్యవసాయపనులగురించి, ఆట పాటలగురించి పురుషులు; పిల్లా జెల్ల నుగురించి, ఇల్లువాకిళ్ళ గురించి స్త్రీలు మాట్లాడుకుంటారు.

ప్రపంచమంతటా స్త్రీలను సర్వసాధారణమైన విషయం దుస్తులు. సమయాసమయాలు లేకుండా కనబడగానే మాట్లాడేది. వాటినిగురించే. పురుషులకు ప్రపంచమంతటా ఆకర్షించే విషయాలు శూన్యం. స్త్రీ లెంతటి అదృష్టవంతు రాండ్రు!

స్త్రీ పురుషు లున్నచోట ఎట్లా మాట్లాడాలన్నది క్లిష్ట సమస్య. వారు కలసి మాట్లాడటంలో ఆనందం అనుభవించటం కష్టమని కొందరంటారు. కాని ఆలోచిస్తే అది సబబుగా తోచదు. స్త్రీపురుషులు కలసి మాట్లాడుకోవటంలో మహదానందం ఉన్నది. దానిలో కొంత ఆకర్షణ, వినోదం లేకపోలేదు.

పురుషులు సహజంగా తాము చెప్పేసంగతి తమకు బాగా తెలుసని విశ్వాసం కలవారు. వారు వాద

32