పుట:మాటా మన్నన.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పని లేదని తలచవచ్చు, కాని అట్లా తలచరాదు. నిజాయితీ అనగా నిష్కాపట్యము (Candour). కాని వీటిని మర్యాదగ భావించరాదు. తెలివిగలవారి ముందు యుక్తిపరుల ఎదుట సిన్సియర్ ఒపీనియన్ నిష్ప్రయోజనం.

మన విశ్వాసాలు సరియైనవి అయినట్లయితే వాటిని వెల్లడించడానికి సంకోచించరాదు. అభిప్రాయాలు (opinions) విశ్వాసాలు (convissions) ఒకటి కాదు. అట్లాగే ఆచారాలు విశ్వాసాలు ఒకటి కాదు.

ఆచారం పరంపరగ వచ్చేది. అది విశ్వాసం వున్నా లేకపోయినా ఆచరించేదే. అందుచేతనే లోకంలో చాలా మంది ఆచారవంతులున్నారు గాని విశ్వాసవంతులు కారు.

ఉపజ్ఞ:

సంభాషణాపద్ధతులన్నింటిలో ఉపజ్ఞ కష్టమైనది . ఉపజ్ఞతోకూడిన సంభాషణకు శైలి అవసరం. దీన్ని సంభాషించటానికి సంస్కృతిగలవారితో సంబంధం పెట్టుకోవటం సంభాషణాపద్దతులు నేర్చుకోవటం మంచి సాహిత్యం చదవటం అవసరం.

ఒక విషయాన్నిగురించి ఆలోచిస్తున్నప్పుడు పరాభిప్రాయాన్ని గాక, తాను స్వయంగా ఆలోచించి చెప్పటమే ఉపజ్ఞ. చాలా విషయాలు నిరుత్సాహంగా వుంటవి, ఎందుకంటె విన్నవగుట చేత, ఒక విషయాన్ని గురించి మనకు బాగా తెలుసును అనుకుంటే మనం దానినిగురించి బాగా ఆలోచించలేదన్నమాట. ప్రతిభ నవనవోన్మేషమైనది. సైంటి

20