పుట:మాటా మన్నన.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

short word will do, you always lose by using a long one. You lose in clearness, you lose in expression of your meaning; and in the estimation of all men who are competent to judge, you lose in reputation for ability"

-BEYANT.

మర్యా ద:

మాట మన్నన తేవాలి. మన్ననలేని మాట మాటకాదు. కనుక సంభాషణలో మర్యాద మన్నన చాలా అవసరం. సంభాషణలో అప్రియానికి నిష్కపటత్వానికి భేదం తెలియని వారున్నారు. అప్రియం మర్యాదకు భిన్నమైనది, తను భావించినట్లు నిజంగా మాట్లాడవచ్చును. కాని అది వినేవారికి అప్రియంగా వుండరాదు. సత్యం చెప్పేటప్పుడుకూడా అప్రియం చెప్పరాదు, అందుచేతనే 'సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ ; నభ్రూయాత్ సత్య మప్రియం' అన్నారు. కనక ప్రియంగా మాట్లాడటం నేర్చుకోవాలి. నిష్కాపట్యం అప్రియంకాదు; దానికి భిన్నమైనది.

ఎటువంటి సన్నిహితులతో మాట్లాడినా అప్రియంగా (Blunt) మాట్లాడరాదు. ఆమాట 'ఈటి' వంటిది. పరులకు వ్యధ కలిగేటట్లు ఎప్పుడూ మాట్లాడరాదు. కొందరి నోరు మాట్లాడుతూవుంటే నొసలు ఎక్కిరిస్తవి. ఇది అనర్ధకరమైనది.

18