పుట:మాటా మన్నన.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభావం కలుగజేయలేవు. దీనికి కారణం వారి అభిప్రాయాల్లో తికమక , లేక చక్కగా వెలిబుచ్చ లేకపోవటం.

భాషా దారిద్ర్యమే సుస్పష్టంగా చెప్పలేనందుకు కారణమని మన కొకప్పుడు తోస్తుంది. ఈ లోపం లేకుండా ఉండాలంటే చిన్న చిన్న వాక్యాలతో మాట్లాడటం మంచిది.

స్పష్టంగా చెప్పలేకపోవటానికి గల కారణాలలో ఒకటి మన భావాలను తగ్గుస్థాయిలోచెప్ప ప్రయత్నించటం. ఒక ప్రొఫెసరు తన భావాలను చిన్నపిల్లలకు చెప్ప ప్రయత్నించినపుడు ఇటువంటిది జరుగుతుంది. తర్వాత తన మాతృభాషలోగాక పరభాషలో మాట్లాడేటప్పుడు కూడా జరుగుతుంది.

ఏమాట ఎట్లా వాడితే, వాక్యరచన ఎట్లా చేస్తే వాక్యం భావ యుక్తంగా స్పష్టంగా ఉంటుందో వారికి తెలియదు.

స్పష్టంగా మాట్లాడేవారు శ్రోతల ఆమోద, హర్షాల్ని పొందగలరు.

సంగ్రహం:

సంభాషణ సంగ్రహంగా ఉండటం అన్నివిధాల మంచిది. గొప్పవారు ఎప్పుడూ వాచాలురుకారు. వారు మితముగ భాషింతురు. వారి భావములు పలుకులు సమానముగ తూగును. ఆ మిత భాషలో జగత్తును నడుపు సూత్ర ముండును. వారి వచనములు సూత్రప్రాయములై ఉండును.

16