పుట:మాటా మన్నన.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయం గాంచామన్నమాటే. మాట్లాడే పద్దతి, మాట్లాడే విషయం, సంభాషణలోని సంగతులని గుర్తించాలి. ఆవి నియమాలని అనుకోరాదు. మాటల శక్తియుక్తులు మాట్లాడేటప్పుడు మనం పాటించే పద్ధతినిబట్టే ఉంటవి. కనుక ఆ పద్దతులను జాగ్రత్తగా పాటించాలి మనం.

చిరునవ్వు, స్పష్టం, సంగ్రహం, నిరాడంబరం, మర్యాద, నేర్పు, నిజాయితీ, ఉపజ్ఞతని, మాధుర్యం , ఇవన్నీ మంచి సంభాషణకు అవసరాలు.

అందంగా వుండటానికి ఎన్నో నగలూ, నాణ్యాలు, దుస్తులు ధరిస్తారు. చిరునవ్వు లేకపోతే ఎన్నున్నా శవాలంకారమే. చిరునవ్వే అందర్నీ ఆకర్షించేది,

మాటలకంటె అభినయమే అధికంగా ఆకర్షించేది, 'నీవంటె నాకిష్టం. నిన్ను చూచి ఆనందించాను' అని అది చెపుతుంది.

తెచ్చి పెట్టుకొన్నది కాగూడదు. చిరునవ్వు. హృదయము నుండి వెలువడాలి. నవ్వు అంటె సానుభూతి అన్నమాట.

గంభీర హృదయులను గాంచినపుడు భీతి, మూతి ముడుచుకున్నవారిని చూచినపుడు అయిష్టం; చిరునవ్వుగల వారిని చూచినపుడు పరమానందం కలుగుతుంది. ఇది నిత్య జీవితంలో అందరకు తెలిసిన విషయమే.

అనుభవంగల వర్తకులు చిరునవ్వుతో ఆహ్వానిస్తారు. అందుచేతనే “చిరునవ్వు నవ్వనివారు దుకాణము పెట్టరాద”ని చీనాదేశపు సామెత.

14