పుట:మాటా మన్నన.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చదువుకున్న వారు తాము చదివిన గ్రంధాలనిగురించి మాట్లాడుకోవటం అవసరం. ఒక్కొక్కరు ఎట్లా భావించారో తెలుస్తుంది.

బంధుమిత్రులు, ఇంట్లోవారు కలసి సంభాషించటం అల్పసంగతి అని ఎంచరాదు. దీనివల్ల లాభం లేదని కొందరు తలుస్తారు. మన అనుభవాలను పెంపొందించు కొనుటకు ఇదికూడా ఎంతో ప్రయోజనకారి.

వీరంతా మనలోవారుకనుక వెరపులేకుండా మన భావాలను చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. పరస్పర క్షేమాభిలాషులైన వీరి సంభాషణ పరమ ప్రయోజనకారి.

నాల్గవది విద్వద్గోష్ఠి. ఇది మన మెదడు అభివృద్ధి పొందటానికి అధికంగా తోడ్పడుతుంది. వారి సంభాషణ అంతా క్రమబద్ధమై పాండిత్య ప్రకర్షలను ప్రదర్శించేదిగా ఉంటుంది. ఉన్నత భావలబ్ధికి జ్ఞానాభివృద్ధికి ఇటువంటి గోష్ఠులు అధికంగా తోడ్పడుతాయి. పూర్వం విద్వద్గోష్ఠులు అధికంగా ఉండేవి. ఉపన్యాసాలకంటే ఇటువంటి గోష్ఠుల వలన ప్రయోజనం అధికం.

చివరికి మిగిలింది దైనందిన సంబంధం. ఇది పరిమితమైన వాక్కులతో కూడింది. కాని ఇదికూడా అల్పమని అనుకోరాదు. దీనిలోనూ ఎంతో మర్యాద మన్నన ఉన్నవి. ఇతరులతో స్నేహ గౌరవాలు దీనివల్ల కలుగుతవి. విశేషంగా ఇది ప్రేమానురాగ సంబంధం. పరిచయులు కనపడగానే 'క్షేమమా?' అనటంతో వారియం దెంతో మనం ప్రేమ కన్పరుస్తున్నామన్నమాట. ఆమాట మన హృదయం

11