పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

మహాభారతతత్త్వ కథనము

టీ: జయం- జయోనా మేతిహాసో౽య మితి వక్ష్యమాణ త్వాత్ జయసంజ్ఞం భారతాశాఖ్య మితిహాసంవా ! “అష్టాదశపురాణాని రామస్య చరితం తథా ! క్షాార్ణం వేదం పంచమంచ యన్మహాభారతం విిదుః | తథైవ విష్ణుధర్మా శ్చ శివధర్మాశ్చ శాశ్వతాః |జయేతి నామ తేషాంచ ప్రపదంతి మనీషిణః !" ఇతి భవిష్యవచనాత్పురాణా దికం వా ! "చతుర్ణాం పురుషార్ధానా మపి హేతౌ జయోస్త్రియామ్" || ఇతి కోశా దన్యం వా సర్వపురుషార్థప్రతిపాదికం గ్రన్థం శారీరక సూత్రభాష్యాది రూప ముదీరయేత్ ||"

అనగా అష్టాదశపురాణములు, రామచరితము, పంచమవేద మగు వేదవ్యాసమహాభారతము, విష్ణుధర్మములు, శివధర్మములు, వీని కన్నిటికీ జయ మని వ్యవహార మున్నవని భవిష్యపురాణవచనము బో ధించు చున్నది. సర్వపురుషార్థప్రతిపాదకమైన గ్రంథము జయమని కోశ ము బోధించుచున్నది. మహాభారతమందు - 'జయోనామేతీహా సోయమ్' అని చెప్పబడుటచేత భారతేతిహాసము జయ మని బోధిం పబడినది. అని భావము.

ఈ ప్రమాణములచే మహాభారతమంతయు జయ మనబడును కానీ, అందేదో కొంతభాగము జయ మనబడ దని స్పష్టము

దీనిచే గీతారహస్యము (718 పు) లో 'జయశబ్దముచే భార తయుద్ధమందు ప్రాప్తమైన పాండవుల యొక్క జయ మర్థమని వివక్షితముగ గన్పట్టుచున్నది. మఱియు నటు లర్థము గావించి కొంటిమేని భారతయుద్ధము యొక్క వర్ణనము జయ మనుపేరు గలిగిన గ్రంథమున వర్ణింపబడిన దనియు, పిదప దానికే యైతి హాసికగ్రంథములలోని యుపాఖ్యానములు చేరుటవలన నితిహా సము, ధర్మాధర్మవివేచన మను నీ రెండింటిని నిరూపించుట