పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

మహాభారతతత్త్వ కథనము

అని చెప్పుకొనుచువచ్చి-

   మహాప్రస్థానికం పర్వ స్వర్గారోహణికం తతః |
   హరివంశ స్తతః సర్వ పురాణం ఖిలసంజ్ఞితమ్ ||
   విష్ణుపర్వ శిశో శ్చర్యా విష్ణోః కంసవధ స్తథా |
   భవిష్యం పర్వచా ప్యుక్తం ఖిలే ష్వేవాద్భుతం మహత్ |
   ఏత త్పర్వశతం పూర్ణం వ్యాసేనోక్తం మహాత్మనా !(ఆది 2 అ}

అనుటబట్టి అనుక్రమణికాపర్వముమొదలు హరివంశాంతము కల నూరుపర్వముల గ్రంథము భారతేతిహాస మనియు, నూరు పర్వ ములు పూర్ణముగా వ్యాసప్రోక్తములే యనియు సౌతియే చెప్పి యుండుటచేతను,

ఆనూరుపర్వములలో అష్టాదశమహాపర్వాంతర్గతములు__

  “స్వధర్మనిర్జితం స్థానం స్వర్గే ప్రాప్య స ధర్మరాట్ |
   ముముదే పూజిత స్సర్వే స్సేంద్రై స్సురగణైస్సహ ||
   ఏత దష్టాదశం పర్వ ప్రోక్తం వ్యాసేన ధీమతా |
   అష్టాదశైవ మేతాని పర్వా ణ్యేతా న్యశేషతః ||
   ఖిలేషు హరివంశశ్చ భవిష్యం చ ప్రకీర్తితమ్ !” (ఆది.2అ}

అనుటనుబట్టి అనుక్రమణికాపర్వము మొదలు స్వర్గారోహణ పర్వాంతముకల 97 పర్వములే యనియు, మిగిలినవి హరివంశములోని వనియు, అష్టాదశపర్వవిభాగము వ్యాసకృతమే యనియు, సౌతియే చెప్పియుండుట చేతను మహాభారతకర్త వేదవ్యాసమహర్షియే.

వ్యాసమహాభారత మట్టి యసాధారణరచనాదికము కలది కనుకనే -

   “కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుమ్|
    కోహ్యన్యః పుండరీకాక్షా న్మహాభారతకృ ద్భవేత్ ||"