పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహాభారతతత్త్వ కథనము

యణం సమస్కృత్యేత్యారభ్య అనేన భారతకథాంశమాత్రం 'పరాశ రాత్మజో విద్వాన్' ఇత్యతఏ వారభ్య తద్వక్తవ్య మితి నాదర్తవ్య మితి భావః|| ఏతద్భారతస్య వపుః = శరీరమ్, సత్యం = బ్రహ్మః అమృతం = దేవభావ శ్చాత్రైవాస్తీత్యర్థః ఉత్తరగ్రన్థస్త్వస్య రాజ్ఞయివ పరివారస్థానీయః తత్త్వం త్వత్రైవ సూత్రిత మిత్యర్థః "

ఇచ్చట శ్రద్ధయు నియమము కలిగి యీయధ్యాయము జపించి నవాడు పాపవిముక్తు డగును. భారతముయొక్క ఈయనుక్రమణికా ధ్యాయమును ఆదినుండియు శ్రవణము చేసిన ఆస్తికునకు కష్టములు తొలగును. ప్రతి పర్వకాలమందును శుచియై యీ యధ్యాయమును పఠించినవాడు భారత మంతను పఠించినఫలము నొందును. ఈక్షార్ణ (వ్యాసప్రోక్త) వేదమును వినిపించిన విద్వాంసుడు పాపవిముక్తుడగును, అని అనుక్రమణికాధ్యాయపఠనశ్రవణఫలము చెప్పబడినది.

దీనినిబట్టి "అనుక్రమణికాధ్యాయమందు ... సౌతి భారతపఠనశ్ర వణములచే నగు ఫలము జెప్పియుండెను" (పు 39) అను మ||భా||చ గా రుల వ్రాత నిరస్తమైనది "

మఱియొక విషయు మనుకొనవలసియున్నది____

మహాభారతారంభమునశౌనకుడు సౌతిని ప్రశ్నించినపుడు జనమే జయునకు వైశంపాయనుడు వినిపించిన వ్యాసప్రోక్తభారతమును నీవు మాకు వినిపింపు మని కోరినట్లును, సౌతి యట్లే వినిపింతునని చెప్పి యుపక్రమము చేసినట్లును చెప్పబడినది. తరువాత సౌతి చెప్పుటలో పర్వసంగ్రహపర్వానంతరము ఆ వైశంపాయనుడు జనమేజయునకు చెప్పి నట్లున్న గాధనే యెత్తుకొనక, పౌష్య పౌలోమాస్తీకపర్వములను ముందు చెప్పినట్లు ప్రతిపాదింపబడినది శౌనకాదులు కోరినదానికంటె నధికముగా జెస్పబడినట్లున్న యాగ్రంథము వైశంపాయనుడు వినిపిం