పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వనిరాకరణము

61

ప్రథమాధ్యాయస్థకథాసంగ్రహముకంటె ద్వితీయధ్యాయస్థకథాసం గ్రహము విపులముగానున్నది. అవ్యవహితాధ్యాయద్వయమందు కథా సంగ్రహ వైచిత్య్రము, అం దేయధ్యాయమున కా యధ్యాయమునకే, ఫలశ్రుతియు, కలిగియుండుటకు తాత్పర్యము తెలిసికొనవలసి యున్నది.

టీ. అత్రకేవలస్య సోపాఖ్యానస్యచ భారతస్య స్మరణే అద్యయోః పర్వణో స్తాత్పర్యమ్ ||

అని చెప్పబడుటచే, 24 వేలని చెప్పబడిన కేవలభారతము నందలి కథాసంగ్రహము ప్రధమాభ్యాయ మందును, లక్షసంఖ్యకల సోపాఖ్యానభారతమునందలి కథాసంగ్రము ద్వితీయాధ్యాయ మం దును ప్రదర్శింపబడిన దని భావము.

ప్రథమాధ్యాయమాత్రపాఠమునకు ప్రథమాధ్యాయమందును, భారతపాఠమునకు ద్వితీయాధ్యాయ మందును ఫలశ్రుతి చెప్పబడినది.

———♦ అనుక్రమణికాధ్యాయ ఫలశ్రుతి ♦———

“శ్రద్దధాన స్సదా యుక్త స్సదా ధర్మపరాయణః |
ఆసేవ న్నిమ మధ్యాయం నరః పాపాత్ప్రముచ్యతే ||
అనుక్రమణికాధ్యాయం భారత స్యేమ మాదితః |
ఆస్తిక స్సతతం శ్రుణ్వ న్న కృఛ్రే ష్వవసీదతి ||
భారతస్య వపుర్హ్యేత త్సత్యం చామృత మేవ చ |
నవనీతం యథా దధ్నో ద్విపదాం బాహ్మణో యథా ||
య ఇమం శుచి రధ్యాయం పఠే త్పర్వణి పర్వణి |
అధీతం భారతం తేన కృత్స్నం స్యా దితి మే మతిః ||
క్షార్ణం వేద మిమం విద్వాన్ శ్రావయిత్వా౽ర్థ మశ్నుతే |
భ్రూణహత్యాదికం చాపి పాపం జహ్యా దసంశయమ్"||

టీ|| యుక్తో = నియమవాన్; ఆసేవన్ = జపన్ ; ఆదితః = నారా