పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

59



"క్షణం కురు మహారాజు విపులో౽య మనుక్రమః |
 పుణ్యాఖ్యానస్య వక్తవ్యః శ్రీ కృష్ణద్వైపాయనేరితః ||"

అనునది, ఇక్కడ మ, భా. చ. కారుల వ్రాతనుబట్టి అయ మనుక్రమః' ఈపూర్వాధ్యాయము అనుక్రమణికాధ్యాయము' అని యర్థ మన్నమాట. ఔను. 'నిరంకుశత్వాత్తే తుండస్య' అన్నట్లు వారి కడ్డేమున్నది!

మనము శ్లోకసమన్వయము చేయుదము-

“పుణ్యాఖ్యానస్య కృష్ణ ద్వైపాయనేరితః విపులః అయ మను క్రమః వక్తవ్యః మహా రాజ క్షణం కురు"

ఇట్టియస్వయములో 'అయమ్ ' అనుపదముచే పూర్వాధ్యాయ మునే గృహించినయెడల నది ఉక్త మగుటచే వక్తవ్యపదముతో నన్వ యింపదు. మఱియు, వారు ఆయధ్యాయమందు 50 శ్లోకములనే పరి గ్రహించుటవలన నది సంక్షిప్తమే కనుక దానికి విపులపదముతో నన్వ యము కుదరదు.అపూర్వాధ్యాయమును వినియే యున్న జనమేజ యుని వినుటకు ప్రోత్సహించుటకై సావధానుడవు కమ్మను మాటకు ఆవశ్యకత కలుగదు. కనుక వారి యన్వయము దుష్టము.

ఇక్కడ 'అయమ్' అనుపదముచే బుద్ధిస్థమైన వక్ష్యమాణము నే గ్రహింపవలెను అది విపులమైనదియు, వక్తవ్యమై యున్నదియు, గనుక నాపదద్వయముతో సమన్వయించును. అది పూర్వాధ్యాయో క్త సంక్షిప్తగాధను అనుసరించి నడచునదికనుక ననుక్రమ మనబడును. అట్టి విపులమైన గాధను వినుటకు సావధానుడవై యుండు మనుమాట కావశ్యకత కలుగును. ఇదియే విద్వత్సమన్వయమార్గము.

ఇక మ! భా!చ! కారుల వెనుకచూపిన వ్రాతలోని యంశ మొకటి మిగిలినది అది యేదనగా ఆ 51వ అధ్యాయములోని కడపటి