పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

మహాభారతతత్త్వ కథనము

యధ్యాయము ఆదిపర్వములో 61వ యధ్యాయము. దానికికథా సంక్షేపాధ్యాయమని పేరు. దానియందు 56 శ్లోకము లున్నవి. మొదటి యైదుశ్లోకములును వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన వాక్యములు. కడపటిశ్లోకము కూడ వైశంపాయనుని వాక్యమే. నడుమనుండిన 50 శ్లోకములలో భారతేతిహాసము నిరూపింపబడినది. కడపటి శ్లోకమునందు ఈ యనుక్రమణికా ధ్యాయములోని గాధకు జయ మని పేరు గల దని చెప్ప బడినది" (పు.40)

ఈ ప్రతివాదులు అధ్యర్థ శతశబ్దమునకు 150 అని యర్థము అను క్రమణికాధ్యాయ మం దధికశ్లోకము లున్నందున సరిపడదని తాము 50 అని అర్థము చెప్పి, అంతమాత్రమే శ్లోకము లున్న అనుక్రమణికా ధ్యాయమును చూపలేక, కథాసంక్షేపాధ్యాయమును తాము చెప్పిన 50 శ్లోకములకంటె నధిక శ్లోకములు కలదానినె చూపి, యిది యనుక్రమణి కాధ్యాయమే యని చెప్పి, ముందువెనుక నున్న శ్లోకములు విడిచి, నడుమశ్లోకములే లెక్కించి, తమయర్థమునకు సరిపుచ్చినట్లు చేసినారు.

వీరీపనిని ఆయనుక్రమణికాధ్యాయమందే యేల చేయరాదో, అట్లు ఆయధ్యాయమందే చేసినచో అనుక్రమణికాధ్యాయము కాని దానిని అనుక్రమణికాధ్యాయ మని చెప్పినారను నేరము లేకనేపోవును.

ఈప్రతివాదులు తాము చూపిన 61 వ అధ్యాయము అనుక్ర మణికాధ్యాయ మనియే చెప్పబడెనని వ్రాసినారు. దానిని చూతము-

ఆ యధ్యాాయమే అనుక్రమణికాధ్యాయ మని కూడ 62 వ అధ్యాయము 12 వ శ్లోకమునందు చెప్పబడి యున్నది” (పు40) ప్రతివాదులు చెప్పిన ఆశ్లోక మేది యనగా-----