పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహాభారతతత్త్వ కథనము

డు. కావ్యము వ్రాసిన వాడొకడు అందు సర్గములు విభజించిన వాడు మఱియొకడు' అన్నట్లు హాస్యాస్పదము ఇక ఆ 100 పర్వములను 18 పర్వములుగా సౌతి చేసినను వారి వాదమునకు వారు చూపిన ప్రమాణము బలకర మగునేమో చూతము---

శౌనకాదులకు సౌతి చెప్పుచున్న సందర్భములో నిట్లున్నది---

'భారత స్యేతిహాసస్య శ్రూయతాం పర్వసంగ్రహః' అ||2. శ్లో / 41. ని ప్రారంభించి ... "భవిష్యపర్వచా వ్యుక్తం ఖిలే ష్వేవాద్భుతం మహత్ " 81. అనువరకు 100 పర్వములు చెప్పి, తరువాత--,


ఏత త్పర్వశతం పూర్ణం వ్యాసే నోక్తం మహాత్మనా
యథాన త్సూతపుత్రేణ లౌమహర్షణీనా తతః
ఉక్తాని నైమిశారణ్యే పర్వాన్యష్టాదశైవ తు ||


అని చెప్పబడినది. ఇచ్చట 'ఏత త్పర్వశతం పూర్ణం వ్యాసే నోక్తమ్' 'అనునపుడు రచింపబడిన దని యర్థము, 'సూతపుత్రేణ అష్టాదశప ర్వాణి నైమిశారణ్యె ఉక్తా న్యేవ' అనునపుడు ఋషి ప్రశ్నానుగుణము వ్యాసప్రోక్తమునే వినిపింప నారంభించిన సౌతిచే వినిపింపబడి న వనియే యర్థము ఇచ్చట 'గ్రంధ మంతయు వ్యాసకర్తృక'మే యైన యెడల వ్యాసుడే 'వ్యాసే నోక్తమ్' అని అన్యులు చెప్పినట్లు చెప్పుట అసంగత' మని ప్రతివాదులు ఆక్షేపింతురేమో-

"అనుక్రమణికాపర్వము, పర్వసంగ్రహపర్వము, పౌలోమప ర్వము, పౌష్య పర్వము సౌతి కావించిన వనుటకు సంశయము లేదు"