పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

49


దీనివలన 18 పర్వముల విభాగమును సౌతియే చేసె న ని నిర్వి వాదముగా సిద్ధించుచున్నది."

వీరి వెనుకటి వ్రాత యిట్లున్నది:-

“సౌతి తన గ్రంథమునకు 18 పర్వముల నేర్పరచెను. ఈపర్వ విభాగము కొత్తదియును, నతడే కావించినదియు నైయున్నది. వైశంపాయనుడు భారతమం దేపర్వములనేర్పఱిచెనో అవి మఱి యొకవిధముగానున్నవి. చిన్నవి, మఱియును వాని సంఖ్య 100 అయియున్నది ... ఇందువల్ల నుక్తమైన రెండు ప్రకారముల విభాగములు భిన్నభిన్నగ్రంథకారులు చేసినవే యని స్పష్ట ముగా తెలియుచున్నది. అనగా వైశంపాయనుని భారతగ్రంథ మందు పర్వములని పేర్లు కల విభాగములుండెను. అవి మిక్కిలి చిన్నచిన్నవిగా నుండెను. సౌతి యీచిన్నపర్వములను ఒక్కచో జేర్చి తన బృహద్గంథములోని 18 భాగములను చేసెను."

ఈవ్రాతలలో నొక చోట 'ముందు వ్యాసమహర్షి 100 పర్వము లను రచించెను' అని చెప్పి, మఱియొక చోట 'వైశంపాయనుని భారత గ్రంథమందు ఆతడు చిన్నచిన్న 100 పర్వముల నేర్పఱిచెను' అని చెప్పుట పరస్పర విరుద్ధము.

“ఏతత్సర్వశతం పూర్ణం వ్యాసే నోక్తం మహర్షిణా'అని వారు చూపిన ప్రమాణము పర్వశతము వ్యాసరచితమని చెప్పుచుం డగా వైశంపాయనునకు ఆపర్వశతసంబంధము కల్పించుట విరుద్ధము.

ఇక, వ్యాసప్రోక్త గ్రంథమునే, పర్వశతముగా విభాగము చేసిన వాడు వైశంపాయనుడని యొక వేళ అందురేమో. ఆమాట నాటకము వ్రాసిన వాడొకడు, అందు అంకములను విభజించినవాడు మఱియొ