పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

45

మహాభారతము ద్రోణపర్వ అ 99.

"రథమార్గప్రమాణం తు కౌంతేయో నిశితైశ్శరైః:
చకార తత్ర పంధానం యయౌ యేన జనార్దనః
తేతు నామాంకితాః పీతాః కాలజ్వలనసన్నిభాః |
స్నాయునద్ధా స్సుపర్వాణః పృథవో దీర్ఘగామినః ||"

 
స్కాందము, ధర్మారణ్య ఖండము, అ. 34 .

"శాసనం తత్ర రామస్య రాఘవస్య చ నామతః |
శ్రుణు తామ్రాశ్రయం తత్ర లిఖితం ధర్మశాస్త్రతః"


పద్మపురాణము. రామాశ్వమేధము అ. 10.

'బబన్థ భాస్వరం పత్రం తప్తహాటక నిర్మితమ్|
తత్రాలిఖ ద్ధాశరధేః ప్రతాపబల మూర్జితమ్'||

ఇత్యాది వచనము లెన్నియో లిపి అనాదిగా నున్నదని యుద్ఘో షించుచున్నవి.

ఇక ప్రతివాదులు చూడవలసిన దన్న ఆంధ్రవిజ్ఞానసర్వస్వము అక్షరవ్యాసము ఇదిగో చూడుడు ---

" .....ఇట్లు తేలిన సారాంశమేమనగా ఋగ్వేదకాలమునుం డియు...... హిందువులు లిపి నెరుంగుదురు" ఇంత పురాతన కాలము కిందట పూర్ణమైన అక్షరాత్మక లిపి నెరిగిన జాతి మరియొకటి లేదు. ఇటు వైదిక కాలమునుండియు లిపి వాడుక యందున్న యెడల వేదమును జనులు ముఖతః నేర్చుకొను నభ్యాసమును' దానికి శ్రుతి యని పేరును ఏలవచ్చెను ? ... అని ప్రతిపక్షులు ప్రశ్న లడుగవచ్చును ... శ్రుతిశబ్దమునకు విన్నదియని యర్థము లోని