పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

43

మహాభారతేతిహాసమునకు సర్వపర్వవృత్తాంతరూపమైన అను క్రమణికాధ్యాయమును చేసి వ్యాసమహర్షి శిష్యుల కధ్యాపనముచే యుట ఎట్లని చింతించెను. అప్పుడు బ్రహ్మ మహర్షికి ప్రీతినిమిత్తము, లోకులకు హితమునిమిత్తము దర్శనమిచ్చెను. అని యున్నది,

తరువాత మహర్షి బ్రహ్మను పూజించుట, భారతనృత్తాంతము చెప్పుట యున్నది. కాని యితరము లైన ప్రతులలో నున్నట్లు.- ‘పరం న లేఖకః కశ్చి దేతస్య భువి విద్య తే' అని చెప్పినట్లు లేదు. బ్రహ్మ-మహర్షిని, భారతమును శ్లాఘించి వెళ్ళిపోయే నని యున్నది. ఇతరము లైన ప్రతులలో నున్నట్లు “కావ్య లేఖనార్థాయ గణేశ స్స్మర్య తాం మునే' అని చెప్పి వెళ్ళినట్లు లేదు. ఈ పాఠక్రమములో తాను సిద్ధము చేసిన గ్రంథమును శిష్యులకు చెప్పుట కేమి లోపమున్న దని వ్యాసమహర్షి చింతించెనో తేలలేదు. ఆమహర్షి చింతించుచుండగా తెలిసి వచ్చిన బ్రహ్మ ఆచింత నేయుపాయమున దీర్చెనో తేలలేదు, ఆమహర్షి యెందులకో చింతించుచుండ నాచింత తీరక యే బ్రహ్మ దర్శనము చే మహర్షికి ప్రీతి, లోకులకు హితముఎట్లయ్యెనో తెలియలేదు.

గణేశవృత్తాంతఘటిత పాఠమందు ఇట్టిలోపములు లేవు ఏమ నగా శిష్యులకు చెప్పుట యెట్లని మహర్షికి కలిగిన చింత లేఖకుని గూ ర్చియే యని తేలినది. ఆచింతను గ్రహించియే దర్శన మిచ్చిన బ్రహ్మ గణపతిని ప్రార్థించి లేఖకునిగా జేసికొను మని యుపాయము చెప్పి ఆ చింత దీర్చె నని తేలినది, అట్లు లేఖకునిమాట చెప్పుటను బట్టియే మహర్షికి ప్రీతియు, తన్మూలమున గ్రంథముద్భూత మగు టచే లోకులకు హితము కలిగె నని తెలిసినది.

కనుక పి. పి. శాస్త్రిగారి పరిష్కరణములో గ్రంథము లుప్త మైనట్లు స్పష్టముగా గనబడు చుండుటచే గూడ గణేశవృత్తాంతము ప్రక్షి ప్తము కాదు.