పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

మహాభారతతత్త్వ కథనము


ఈవాక్యములచే పూర్వము ముద్రితములైన ఆరుప్రతులలోను గణేశవృత్తాంత మున్నది. మేము గ్రహించిన ప్రతిలో నావృత్తాంతము లేదు. మేము పరీక్షించిన దాక్షిణాత్యబహుకోశములలో గణేశవృత్తాం తము లేనందున గణేశవృత్తాంతము లేకుండుటే దాక్షిణాత్యభారత గోశములకు చిహ్న మని చెప్పగలము. అని తెలుపబడినది

ఇక, పి. పి. శాస్త్రిగారన్న ఆరుప్రతులలో నొకటగు కుంభ కోణపుప్రతిలో ముద్రాపకు లేమని వ్రాసిరో చూడుడు.

“అనేకేషాం విదుషాం సాహాయ్యేన దాక్షిణాత్యబహుకో
    శానుసారేణ సంశోధ్య ... ప్రకాశితమ్”

దీనినిబట్టి కుంభకోణపు ప్రతి దాక్షిణాత్యబహుకోశముల నాధా రముచేసికొనియే పరిష్కరింపబడినట్లును, ఆ బహుకోశములయందు గణే శవృత్తాంత మున్నట్లును స్పష్టమగుచుండ, దాక్షిణాత్య కోశములలో గణేశవృత్తాంతము లేనేలేదను పి. పి శాస్త్రిగారి మాటను విశ్వసించు టెట్లు ?

మఱియు గణేశవృత్తాంతము లేకుండి పి. పి. శాస్త్రి గారిచే పరి ప్కరింపబడిన గ్రంథములోని పాఠక్రమమునందు ఔచిత్యము కస బడదు. చూడుడు.--

“అనుక్రమణికాధ్యాయం వృత్తాన్తం సర్వపర్వణామ్ |
తస్యాఖ్యానవరిష్ఠస్య కృత్వా ద్వైపాయనః ప్రభుః |
కథ మధ్యాపయామీహ శిష్యా ని త్యన్వచిన్తయత్ |
తస్య చిన్తయమాసస్య ఋషేర్ద్వైపాయసస్యచ |
స్మృత్యా౽౽జగామ భగవాన్ బ్రహ్మాలోక గురుస్స్వయమ్ !
ప్రియార్థం మహర్షేశ్చాపి లోకానాం హిత కామ్యయా ||