పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

37

చున్నది అని చెప్పుటలో సమాననామరూపత్వము ప్రతిపాదింపబడినది. కనుక నీలకంఠియోక్త ప్రకార మీశ్లోకము సందర్భశుద్ధికలదేకాని ప్రక్షిప్తము కాదు, ఇక వెనుక జూపబడిన 'జ్ఞానదీపికా' వ్యాఖ్యానమును బట్టి చూచిన యెడల వర్తమానమహాభారతమందే, మనువును గూర్చి యొక చోట, ఆస్తీక చరిత మొకచోట, ఉపరిచరి వసుచరిత్ర మొక చోట వర్ణింపబడుట చేతను, అని భారతోపాఖ్యానమునకు సంబంధించినవే అగుట చేతను భారతోపాఖ్యానమున కాదిని నిర్ణయించుటలో మూడు విధములుగా మునిమతభేదము ప్రదర్శింపబడినట్లు సమన్వయ మైనందున నాశ్లోకము ప్రక్షిప్తము కాదు. ప్రక్షిప్తత్వకల్పన ప్రతివాదులకు మాత్రమే. ఇట్లు పరీక్షింపగా నీశ్లోకము సర్వవిధముల ప్రతివాదులకే ప్రతికూలము.

(6 )ఇక మ||భా|| చ || కారులు వ్యాసుడు 3 సంవత్సరములురచించిన గ్రంథము 8800 శ్లోకములు మాత్ర మే' (పు 33) అనుచు చూపియున్న ప్రమాణమును పరిశీలింతము--

    “గ్రంథగ్రంథిం తదా చక్రే మునిర్గూఢం కుతూహలాత్ |
     యస్కిన్ ప్రతిజ్ఞయా ప్రాహ మునిర్ద్వైపాయన స్త్విదమ్ |
     అష్టౌ శ్లోకసహస్రాణి హ్యష్టౌ శ్లోకశతానిచ |
     అహం వేద్మి శుకో వేత్తి సంజయో వేత్తివా న వా |
     తచ్ఛ్లోక కూట మద్యాపి గ్రథితం సుదృఢం మునే |
     భేత్తుం న శక్యతే౽ర్థస్య గూఢత్వాత్ప్రశ్రితస్యచ |" అని.

ఇచ్చట ముందుగా పూర్వోత్తరగ్రంథ సందర్భము నవలోకింతము---

వ్యాసమహర్షి భారతగ్రంథము బుద్దిస్టముగా జేసికొని దీనిని శిష్యులకు అధ్యాపనముచేయుట యెట్లని యా లోచించుచుండ నది గ్రహించి బ్రహ్మ మహర్షికి ప్రత్యక్షమై పూజింపబడి సుఖాసీనుడై