పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

మహాభారతతత్త్వ కథనము


షేయము లగుటచే వర్ణానుపూర్వీభేదము కలిగియుండును. కనుక భిన్న కల్పములలోని ఆయాభార తారంభములు మన్వాదిగను, ఆస్తీక చరిత్రాదిగను, ఉపరిచరవసుచరిత్రాదిగను ఉన్నవనుట యుచితమే.

"భారతం పంచమో వేద?”, సర్వశ్రుతిసమూహో౽యమ్ ' అని కీర్తింపబడిన భారతము వేదార్థవివరణరూప ము. ఆ వేదమందలి జ్ఞానకాండమునకు బ్రహ్మసూత్రములను రచించిన మహనీయుడు ఈ మహాభారతక ర్తయే. ఆబ్రహ్మ సూత్రములలో సమాననామరూపత్వాచ్చావృత్తా వవ్యవిరోధో దర్శనాత్స్మృతేశ్చ'(సూ.1-3-30) అను నదియొక సూత్రము. ఈసూత్రము 'సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వ మకల్పయత్ దివంచ పృథివీం చాఁతరిక్ష మథో స్వః' (ఋ.10-190-3) ఇత్యాది శ్రుతిమూలకము. ఇట్టి స్థితిలో శ్రుతిమూలకమగు బహ్మసూత్రమందలి సమాసనామరూపత్వహేతువు నుల్లేఖించి భిన్నకల్పములలోని భిన్న భారతముల ప్రారంభ భేదమును నీలకంఠాచార్యులు సమర్థించుట విద్వన్మనోజ్ఞమే.

బ్రహ్మసూత్రములయందేకాక యీ మహాభారతమందే 'మన్వాది భారతం కేచిత్ ' అనుశ్లోకమునకు వెనుక

    "యథర్తా వృతులింగాని నానారూపాణి పర్యయే |
     దృశ్యన్తే తాని తాన్యేవ తథా భావా యుగాదిషు || 39.

     ఏవ మేత దనాద్యన్తం భూతసంహార కారకమ్ |
     అనాదినిధనం లోకే చక్రం సంపరివర్తతే ||" 40 ( ఆది. అ. 1)

గడచిన ఋతువుల కుండెడి చిహ్నములే మఱల వచ్చుచున్న ఋతువులలో గూడ గనబడుచున్నట్లు గడచిన యుగములలోని విషయములే మఱల నాయుగములు వచ్చునప్పుడు ప్రాప్తించుచుండును. లోకమం దీవిధముగానే ఆద్యంతములు లేక కాలచక్రము తిరుగు