పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

మహాభారతతత్త్వ కథనము

వైశంపాయనునిచే వినిపింపబడిన వివిధములై విచితార్థములై యున్న మహాభారతకథలను విని బహుతీర్థములు సేవించి, కురుపాండవయుద్ధము జరిగిన సమంతపంచక మను పుణ్యస్థలము దర్శించి, యచ్చట నుండి మీదర్శనము చేయదలచి యిచ్చటికి వచ్చితిని.

ఇట్లు చెప్పగా ఋషు లాతనిని కోరిరి-

“ద్వైపాయనేన యత్ప్రోక్తం పురాణం పరమర్షిణా సురై ర్బ్రహ్మర్షిభిశ్చైవ శ్రుత్వా యదభిపూజితమ్ | 17. తస్యాఖ్యాన వరిష్ఠస్య విచిత్రపదపర్వణః | సూక్ష్మార్థన్యాయయుక్తస్య వేదార్థైర్భూషితస్యచ !. 18. భారత స్యేతిహాసస్య పుణ్యాం గ్రంథార్థ సంయుతామ్ ! సంస్కారోపగతాం బ్రాహ్మీం నానాశాస్త్రోపబృంహితామ్ | 9. "జనమేజయస్య యాం రాజ్ఞో వైశంపాయన ఉక్తవాన్ | యథా వత్స! ఋషి స్తుష్ట్యా సత్రే ద్వైపాయనాజ్ఞయా | 20 వేదై శ్చతుర్భి స్పంయుక్తాం వ్యాస స్యాద్భుతకర్మణః | సంహితాం శ్రోతు మిచ్ఛామః పుణ్యం పాపభయాపహామ్ 21

అనగా వ్యాసమహర్షిప్రోక్తమైనట్టియు, "దేవతలచేతను, బ్రహ్మర్షులచేతను విని పూజింపబడినట్టియు, అతర్క్యములగుటచే సూక్మములగు ఆత్మతత్త్వాదిరూపము లైన అర్థములచేతను, తదుపయుక్తము లగు యుక్తులచేతను, వేదతాత్పర్యవిషయభూతము లైన అర్థములచేతను, అలంకరింపబడినట్టియు, నానాశాస్త్రవిషయములచే నుద్దీపితమైనట్టియు, వ్యాసమహర్షి యాజ్ఞవలన జనమేజయునకు వైశంపాయనునిచే వినిపింపబడినట్టియు, వ్యాసమహర్షి యొక్క సంహితను (మహాభారతమును) వినగోరుచున్నాము అని అర్థము. ఇట్లు కోరియున్న ఋషులకు అట్లే చెప్పుదు నని సౌతీ యుపక్రమించుటలో వెనుక జూపిన 'మాతు ర్నియోగా ద్ధర్మాత్మా' (94) అను శ్లోకముతో నారంభించి