పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

మహాభారతతత్త్వ కథనము

పుణ్యాత్ముల యుపాఖ్యానములతో గూడి యుత్తమమై ఆద్యమైన యీ భారతము లక్షగ్రంథముగా దెలిసికొనవలసినది.

(ఈవాక్యము 'ఇదం శతసహస్రం తు' అనుదాని యర్దము. ఈ 'ఇదమ్' శబ్దము వేదవ్యాస విరచిత మై వైశంపాయనుని చే వినిపింపబడిన భారతమునే చెప్పుచుండుటవలన ఆభారతమే లక్ష గ్రంథము అదియే ఆద్యము)

ఉపాఖ్యానములను విడిచి 24వేల భారతసంహితను చేసెను. దీనిని ఉపాఖ్యానరహిత భారత మని చెప్పుదురు.

(ఈ 24 వేల భారతసంహితను చేయుటలో కర్తృత్వము పూర్వ సందర్భమునుబట్టి వ్యాసమహర్షిదేకాని వినిపించెడి వైశంపాయనునది కాదని విజ్ఞులకు తెలిసినవిషయమే. ఉపాఖ్యానములు విడిచి 24 వేలు చేసె ననగా ఆలక్ష గ్రంథములోనే ఉపాఖ్యానభాగములు విడిచిపరిగణించిన యెడలనది 24 వేలగ్రంథ మని భావము}

మఱియు వ్యాసమహర్షి పర్వములతో గూడిన వృత్తాంతములయొక్క అనుక్రమణి కాధ్యాయమును మఱల 150 శ్లోకములుగా సంక్షేపించెను.

(ఇచ్చట భూయః సక్షేపమ్' అని భూయః పదమును. 101శ్లోకములోని 'ఆద్యమ్ ' అనుపదమును పరిశీలింప మొదటిది లక్షగ్రంథ మనియు దాని సంక్షేపము 24 వేలనియు మఱలసంక్షేపము 150శ్లోకము లనియు ఇదంతయు వ్యాసకృతమే అనియు మహాభారత ఘటకమే యనియు స్పష్టము)

ఈ భారతమును వ్యాసమహర్షి మొదట శుకునకును, తరువాత తగిన శిష్యులకును అధ్యాపనము చేసెను.ఇంతేగాక ఆవ్యాసమహర్షి •