పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

మహాభారతతత్త్వ కథనము

చతుర్వింశతిసాహస్రీం చక్రే భారతసంహితా మ్ |
ఉపాఖ్యానై ర్వినై తావద్భారతం ప్రోచ్యతే బుధైః ||102

తతోఽధ్యర్ధశతం భూయస్సంక్షేపం కృతవానృషిః |
అనుక్రమణికాధ్యాయం వృత్తాంతానం సపర్వణామ్ || 103

ఇదం ద్వైపాయన: పూర్వం పుత్రమధ్యాపయ చ్ఛుకమ్ |
తతో ౽ న్యేభ్యో ౽ నురూపేభ్యః శ్శిష్వేభ్యః ప్రదదౌ విభుః || 104

షష్టిం శతసహస్రాణి చకారాన్యాం స సంహితామ్ |
త్రింశ చ్ఛతసహస్రం చ దేవలోకే ప్రతిష్ఠితమ్ || 105

పిత్య్రే పంచదశ ప్రోక్తం గంధర్వేషు చతుర్దశ |
ఏకం శతసహస్రం తు మానుషేషు ప్రతిష్ఠితమ్ || 106

నారదో౽ శ్రావయద్దేవా నసితో దేవల: పితౄన్ |
గంధర్వయక్షరక్షాంసి శ్రావయామాస వై శుకః || 107

అస్మింస్తు మానుషే లోకే వైశంపాయన ఉక్తవాన్ |
శిష్యా వ్యాసస్య ధర్మాత్మా సర్వవేదవిదాం వరః || 108

ఏకం శతసహస్రం తు మయోక్తం వై నిబోధత || 109

ఈగ్రంథములో 108 గా నున్న శ్లోకమునే ప్రతివాదులు తమ వాదమునకు మూడవ ప్రమాణముగాను, దాని తరువాత పాదమునే నాల్గవ ప్రమాణముగాను, చూపియున్నారు.

పైగ్రంథమునకు తాత్పర్యము: ధర్మాత్ముడగు వేదవ్యాసమహర్షి జనని యొక్కయు, భీష్ముని యొక్కయు నియోగముచేతనే ధృతరాష్ట్ర పాండువిదురులను జనింపజేసి మఱల తపస్సునకై యాశ్రమమున కేగెను.ఆధృతరాష్ట్రాదులు పుత్రపౌత్రాదిరూపమున ప్రాదుర్భూతులై , రాజ్యప్రాప్తిచే ప్రవర్ధమానులై పరలోకగతులు కాగా నా వేదవ్యాసమహర్షి యీ మానుషలోకమందు భారతమును జెప్పెను.