పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

మహాభారతతత్త్వ కథనము

యర్థమైనను ప్రమాణవిరుద్ధమైనపుడు హేయమే . ఈ విషయము మ. భా. చ. కారులు ఒప్పినదే.ఒకచోట వారిట్లు వ్రాసియున్నారు. "లోకమాన్య తిలకు,భాసుడు,కాళిదాసునికంటె పూర్వీకుడే యైనను క్రీ.త. 1-2 శతాబ్దములునాటివాెడ యగునని తలతు ననినాడు.గణపతి శాస్త్రులవారి శ్లోకదృష్టాంతపూర్వకమగు నిదర్శనము లోకమాన్యుని తలపుకంటె ప్రమాణము (పు.32 )

ఇట్లు లోకమాన్యుని తలపుకంటె,శ్లోకనిదర్శనము ప్రమాణమనిన మ.భా.చ. కారులీ ఆశ్వలాయన సూత్రమునకు ఆలోకమాన్య ప్రభృతు లూహించిన యర్థముకంటె దేవీభాగవతశ్లోక నిదర్శనపూర్వకమగు నర్థమే ప్రమాణ మనక తప్పునా?

కనుక భారతమహాభారతములు భిన్నగ్రంథము లనియు, భిన్నకర్తృకము లనియు, నిర్ణయించుటకు ప్రతివాదు లాధారముగా బట్టుకొనిన ఆశ్వలాయన సూత్రము వారిని భంగపఱచినది.

కాబట్టి గీతారహస్యము (218 పు)లో "ఆశ్వలాయన గృహ్యసూత్రమందు సుమంతు,జైమిని వైశంపాయన,పైల,సూత్ర,భాష్య,భారత,మహాభారత, ధర్మాచార్యాః " (ఆ గృ. 3-4-4) అని బుషితర్పణమందు భారత, మహాభారతము లనునవి రెండు వేర్వేఱు గ్రంథములని స్పష్టముగ చెప్పబడియుండుటచే సైతమీ యనుమానమే దృఢమగుచున్నది" అనుమాటయు, మహాభారత మీమాంస (సంపుటం 15. సంచిక 3 ) లో " ఆశ్వలాయనుని యొక్క సూత్రమున భిన్న భిన్న నామముల గైకొని "భారత, మహాభారత ధర్మాచార్యాః"అని చెప్పబడియున్నది, ఇందువలన వైశంపాయనాది ఋషులకు భారతచార్య బిరుదము ప్రసిద్ధ మయ్యెను అనియు భారతమహాభారత నామకము లగు భిన్న భిన్నగ్రంథములొక సమయమున బ్రచలితములయ్యె ననియు ననుమితి కలుగుతున్నది' అను మాటయు అపాస్తము లైనవి.