పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

21

బిలిచి ... నాల్గు వేదములను, ఐదవవేదమైన మహాభారతమును నధ్యయనమును చేయించెను. ఆశిష్యులచే వేదసంహితలును, భారతసంహితలును వేఱువేఱ చెప్పబడినవి ' (మ.భా.చ. ఉపోద్ఘాతము - పు 16 )

ఈగ్రంథములోని కడపటివాక్వము 'సంహితాస్తైః పృథక్త్వేన భారతస్య ప్రకాశితాః "అనుదాని యర్థమే. 'ప్రకాశితాః' అనుదానికి చెప్పబడిన వని యర్థము వ్రాయబడెనేకాని చేయబడిన వని యర్థము వ్రాయబడ లేదు. వేదసంహితలును, భారతసంహితలును చెప్పబడినవనుటలో వేదసంహిత లెట్లుచేయబడినవికావో, అట్లే వారలచేత భారత సంహితలు చేయబడినవి కావనియు, అర్థము చెప్పబడిన వనియు ఆచెప్పుటలో వేదసంహిత లుదాహరింపబడిన వనియు స్పష్టముగా గోచరించుచున్నది. ఇది విద్యన్మార్గమునకు చెందియున్నది. ఇట్టి యాగ్రంథమును, సుమంత్వాదు లొక్కొక్క భారతము చేసినారను తమ వాదమునకు ప్రమాణముగా చూపు ప్రతివాదులకు ఎంతసాహసమో!

ఈ తేవప్పెరుమాళయ్యగారి గంథమును చూపినతరువాత వారి వ్రాత యిట్లున్నది- "పై బదునొకండుమందియు బైశ్లోకములకు వ్యాసుడు - సుమంత్వాదులకు వేదములను మహాభారతమును చెప్పెననియు, సుమంత్వాదులు వేర్వేఱు భారతసంహితల జేసిరనియే తాత్పర్యములు జేసిరి. మొదట యెనిమిది మందిపండితులును పైశ్లోకములకు బలము కలిగించుటకు ఆశ్వలాయనుని గృహ్యసూత్రము నే సాక్ష్యముగా జూపిరి (మ. భా. చ. ఉపో. 17పు) | ఆహా! మహాభారతశ్లోకములకు నీలకంఠీయము, ఆశ్వలాయన సూత్రమునకు దేవీ భాగవతశ్లోకములు న్యాయముగా నర్థనిర్ణయము చేసియుండ నట్టి ప్రామాణికార్థమును గjహింపలేక తమకు దోచినట్లు పూర్వోత్తరవిరుద్ధముగను, అసంగతముగను ఎంతమందికల్పించిన