పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

మహాభారతతత్త్వ కథనము

'సూత్రేణయుజ్యతే సూత్రయుక్ పైలశ్చాసౌ సూతయుక్చ పైల సూత్రయుక్' అని కర్మధారయసమాసము. సూత్రునితో గూడిన పైలుడని యర్ధము ఇందు సుమంతుశబ్దము మొదలు మహాభారత శబ్దాంతము ఆచార్య నామములే కాని గ్రంథనామములు లేవను సంగతి “ఇమే సర్వే ధర్మాచార్యా!” ఈనిర్దేశింపబడిన ధర్మాచార్యు లందరు 'తృప్యన్తు' అని కీర్తింపుమనుటచే స్పష్టమగుచున్నది. ఇట్లీ శ్లోకములలో క్రమికాన్వయ ధోరణి లేకుండుట, గ్రంథనామములు కాకుండుట ధ్రువమగుటచే నాసూత్రమున కిట్లే యర్థము చెప్పవలెను.

ఇట్టి ప్రమాణాంతరసిద్ధమగు నీసూత్రార్థమును ప్రమాదముననో, ప్రతారణముననో అస్తవ్యస్తముచేసి యెవ్వరో లోకమున బ్రవేశపెట్టగా "అంథగోలాంగూల" న్యాయమున దాని నందుకొని యెందరో ప్రమాదమునకు పాలైరి .

ఇట్లుండగా మహాభారతచరిత్రకారులు "వేదా నధ్యాపయా మాస (అను పైశ్లోకముల గూర్చియు, ఆశ్వలాయనుని పైసూత్రమును గూర్చియు నీక్రింద జెప్పబడు పండితులు విశేషముగా విమర్శించి నేచెప్పిన యర్థమునే చెప్పిరనుచు లోకమాన్యబాలగంగాధరతిలకు మొదలు తేవప్పెరుమాళ్ళయ్యగారివరకు 11 మంది పేర్ల నుదాహరించిరి. అందులో మహారాష్ట్ర భాషలో గీతారహస్యకర్తను, ఆంధ్రములో గీతారహస్య అనువాదకర్తను, వంగ భాషలో శ్రీకృష్ణచరిత్రకర్తను, ఆంధ్రములో శ్రీకృష్ణచరిత్ర ఆసువాదకర్తను, హిందీలో భారత మీమాంసా కర్తను, ఆంధ్రములో భారతమీమాంసానువాదకర్తను కలిపి యా 11 మందిని చూపినారు. ఆపై తేవప్పెరుమాళ్ళయ్యగారి వచన గ్రంథము సుదాహరించిరి. అది యిట్లున్నది. “విద్వాంసుడును సమర్థుడును.... అగు నాబ్రహ్మర్షి సుమంతుడు జెమిని .... అనే యేవురు శిష్యులను